నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ గా దినేష్‌ కుమార్‌ త్రిపాఠి బాధ్యతలు స్వీకరణ

నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ గా  దినేష్‌ కుమార్‌ త్రిపాఠి బాధ్యతలు స్వీకరణ

నేవీ చీఫ్‌గా అడ్మిరల్‌ గా  దినేష్‌ కుమార్‌ త్రిపాఠి  మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.  గతంలో నావికాదళ కార్యకలాపాల డైరెక్టర్ జనరల్‌గా, వెస్ట్రన్ నేవల్ కమాండ్‌కు ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా పనిచేశారు. ఆర్‌ హరి కుమార్‌ రిటైర్‌ అయిన తర్వాత 26వ నేవీ చీఫ్‌గా అడ్మిరల్‌ దినేష్‌ కుమార్‌ త్రిపాఠి  దినేష్ కె త్రిపాఠి నియమితులయ్యారు. ఆయన నియామకంపై ప్రభుత్వం ఏప్రిల్ 19న అధికారిక ప్రకటన చేసింది. 

జూలై 1985లో త్రిపాఠి ఒక కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ స్పెషలిస్ట్.  కొర్వెట్ INS కిర్చ్, ఫ్రిగేట్ INS త్రిశూల్ వంటి యుద్ధనౌకలకు నాయకత్వం వహించారాయన. ఆయన కెరీర్‌లో కీలకమైన కార్యాచరణ, సిబ్బంది నియామకాలను నిర్వహించాడు.

 హౌతీ తిరుగుబాటుదారులు, సోమాలి సముద్రపు దొంగల నిరంతర దాడుల మధ్య గల్ఫ్ ఆఫ్ అడెన్, పరిసర ప్రాంతాలు, అరేబియా సముద్రం, సోమాలియా తూర్పు తీరంలో భారత యుద్ధనౌకలు విస్తృతంగా మోహరించిన సమయంలో త్రిపాఠి నౌకాదళ పగ్గాలు చేపట్టారు. హిందూ మహాసముద్ర ప్రాంతం (IOR)లో  సముద్ర ప్రాంతంలో చైనా, పాకిస్థాన్‌తో కుమ్మక్కు కావడం, భారత రక్షణ వ్యవస్థకు కూడా ప్రధాన ఆందోళన కలిగించే అంశం. విపరీతంగా నౌకలను తయారు చేస్తున్న చైనా ఇప్పటికే 355 యుద్ధనౌకలు, సబ్ మెరైన్ లతో ప్రపంచంలోనే అతిపెద్ద నౌకాదళాన్ని కలిగి ఉంది.