రామప్ప దేవాలయంలో ఉన్న శివుడి సాక్షిగా పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేస్తా ; సీఎం రేవంత్ రెడ్డి

రామప్ప దేవాలయంలో ఉన్న శివుడి సాక్షిగా పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేస్తా ; సీఎం రేవంత్ రెడ్డి

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారం కోసం బీజేపీ రాముడ్ని కూడా వదలటం లేదని విమర్శించారు. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలని అన్నారు. గుండు, అరగుండు ఇద్దరూ బస్టాండ్లలో దేవుడి బొమ్మ చూపించి డబ్బు అడుక్కున్నట్లు రాముడితో రాజకీయం చేస్తున్నారని అన్నారు.  రిజర్వేషన్ రద్దు చేసేందుకు మోడీ, అమిత్ శాలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. 

రాజ్యాంగాన్ని సవరించేందుకే ఈసారి 400సీట్లు నినాదంతో వస్తున్నారని తెలిపారు. ఈసారి బీజేపీ వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తారని బీజేపీని ఓడిస్తే మన రిజర్వేషన్లు కొనసాగుతాయని తెలిపారు. ఎన్నికలయిన వెంటనే మోదీ దళితులు, బలహీన వర్గాల మీద సర్జికల్ట్ స్ట్రైక్స్ చేస్తారని ఆరోపించారు. 

కేసీఆర్ బస్సు యాత్ర చూస్తే తిక్కలోడు తిరణాలకు పోయినట్లు ఉందని విమర్శించారు. కరీంనగర్, పాలమూరును కేసీఆర్ వాడుకొని వదిలేసారని ఆరోపించారు. కేసీఆర్, బీజేపీతో కుమ్మక్కయ్యాడని ఏనాడో చెప్పినాని తెలిపారు. కేసీఆర్ ను ఇండియా కూటమిలోకి రానియ్యమని వెల్లడించారు. కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకిని కూడా మా ఇంటి మీద వాలనియమని అన్నారు. 

కేసీఆర్ కుట్రలను చూసే కోదండరాం, కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ కు మద్దతు పలికాయాని తెలిపారు. రామప్ప దేవాలయంలో ఉన్న శివుడి సాక్షిగా పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేస్తానని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి.