IPL 2024: హీరోయిన్లను తలదన్నే అందం.. క్రికెటర్ ఫిల్ సాల్ట్ మిస్టరీ గర్ల్

IPL 2024: హీరోయిన్లను తలదన్నే అందం.. క్రికెటర్ ఫిల్ సాల్ట్ మిస్టరీ గర్ల్

ఐపీఎల్ లో ఇంగ్లాండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్ అదరగొట్టేస్తున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున సంచలన బ్యాటింగ్ తో సత్తా చాటుతున్నాడు. మొదట్లో వేలంలో అమ్ముడుపోని ఈ ఇంగ్లాండ్ ఓపెనర్.. సహచర ఆటగాడు రాయ్ తప్పుకోవడంతో అతని స్థానంలో కేకేఆర్ జట్టులో చేరాడు. దీంతో వచ్చిన అవకాశాన్ని సాల్ట్ సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఆడిన 9 మ్యాచ్ ల్లో 392 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో టాప్ 5 లిస్ట్ లో చేరాడు. అతని స్ట్రైక్ రేట్ 180 ఉండడం విశేషం. 

సాల్ట్ ఆటను చూసి ఎంజాయ్ చేస్తున్న క్రికెట్ ఫ్యాన్స్.. ఇప్పుడు అతని గర్ల్ ఫ్రెండ్ ను చూసి ఫిదా అవుతున్నారు. సాల్ట్ గర్ల్ ఫ్రెండ్ అబీ మెక్‌లావెన్‌ అతని ఆట చూసేందుకు ఇండియాకు వచ్చింది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ గా ఉండే ఈమె..తాజాగా ఇంస్టాగ్రామ్ లో తన ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో అబీ  తన అందంతో ఆకట్టుకుంటుంది. హీరోయిన్లను మించే అందంతో అందరి చూపును తనవైపుకు తిప్పుకుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

సాల్ట్ 2020 నుండి అబీ మెక్‌లావెన్‌తో డేటింగ్ చేస్తున్నాడు. వీరిద్దరికీ వివాహం కానప్పటికీ.. వీరి మధ్య చాలా బలమైన సంబంధం ఉంది. ఆమె ఫ్రీలాన్స్ వర్చువల్ అసిస్టెంట్‌గా పనిచేస్తుంది. ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ ప్రాంతంలో నివసిస్తున్న ఆమె నాటింగ్‌హామ్ ట్రెంట్ విశ్వవిద్యాలయంలో తన విద్యను పూర్తి చేసింది, అక్కడ ఆమె భూ వినియోగ ప్రణాళిక అభివృద్ధిలో డిగ్రీని పొందింది.