బార్బర్ షాపులు తెరుచుకోవచ్చు.. రెండు జోన్లకే లిమిట్

బార్బర్ షాపులు తెరుచుకోవచ్చు.. రెండు జోన్లకే లిమిట్
  • మూడో దశ లాక్​డౌన్ సడలింపులపై కేంద్రం క్లారిటీ

న్యూఢిల్లీ: మే 4 నుంచి ప్రారంభమయ్యే మూడోదశ లాక్​డౌన్ కాలంలో సడలింపులపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. బార్బర్ షాపులు, సెలూన్లు ఓపెన్ చేసుకునేందుకు పర్మిషన్ ఉంటుందని పేర్కొంది. కొత్తగా వచ్చిన ఆదేశాల ప్రకారం హెయిర్ సెలూన్లు, బార్బర్ షాపులకు సడలింపు ఉంటుంది. అయితే, ఈ అవకాశం కంటైన్​మెంట్, రెడ్ జోన్లకు వర్తించదు. కేవలం గ్రీన్, ఆరెంజ్ జోన్లకు మాత్రమే పరిమితమని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) శనివారం స్పష్టం చేసింది. లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు మే 17 వరకు పొడిగిస్తూ, ఉత్తర్వులిచ్చిన కేంద్రం.. గ్రీన్, ఆరేంజ్ జోన్లలో అనేక ఆంక్షలను ఎత్తివేసింది. వీటిల్లో ఈ కామర్స్ ప్లాట్ ఫారమ్​ల ద్వారా నాన్ ఎసెన్షియల్ ఐటెమ్స్ విక్రయానికి ఎటువంటి పరిమితులు లేవని తెలిపింది.