- 1605 సీట్లకు13538 దరఖాస్తులు
- గత ఏడాది 33 వేల అప్లికేషన్లు
బాసర, వెలుగు : బాసర ఆర్జీయూకేటీ యూనివర్సిటీలో గత ఏడాదితో పోలిస్తే దరఖాస్తులు భారీగా తగ్గాయి. గతంలో 33 వేల మంది దరఖాస్తు చేసుకుంటే ఈ సంవత్సరం 13,538 వేల మంది అప్లికేషన్లు సమర్పించారని యూనివర్సిటీ డైరెక్టర్ సతీష్ కుమార్ శుక్రవారం తెలిపారు.
ఈ విద్యా సంవత్సరానికి 1404 జనరల్ సీట్లుండగా, స్పోర్ట్స్, దివ్యాంగులు, క్యాప్, ఎన్సీసీ వారికి 96 సీట్లు కేటాయించారు. గ్లోబల్ ఎన్నారై కోటా కింద 105 సీట్లు ఉన్నాయి. మొత్తంగా 1605 సీట్లకు 13,538 దరఖాస్తులు వచ్చాయని, జూలై 3న ఫైనల్‌లిస్ట్ రిలీజ్చేస్తామని సతీశ్‌కుమార్ చెప్పారు. సెలెక్టయిన వారికి జులై 7 నుంచి కౌన్సెలింగ్ ఉంటుందన్నారు.
