
- ఈ నెల 24న కౌన్సెలింగ్
హైదరాబాద్, వెలుగు: బీసీ గురుకులాల్లో 6,7,8,9వ తరగతుల బ్యాక్లాగ్ సీట్ల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్టు సెక్రటరీ సైదులు వెల్లడించారు. ఫలితాలు www.mjptbcwreis.telangana.gov.in లేదా https://mjptbcadmissions.org వెబ్ సైట్ లలో అందుబాటులో ఉన్నాయని గురువారం పత్రిక ప్రకటనలో తెలిపారు.
ప్రవేశ పరీక్షలో వచ్చిన మెరిట్ ప్రకారం సీట్ల కేటాయింపు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. బీసీ గురుకుల పాఠశాలల్లో 6, 7, 8, 9వ తరగతుల్లో 6,832 బ్యాక్లాగ్ సీట్లు ఉండగా ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో 23,611 మంది గత నెల 20న పరీక్ష రాశారని ఆయన చెప్పారు. ఈ నెల 24న కౌన్సెలింగ్ ఉంటుందని తెలిపారు.