బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.ఆయన చికిత్స పొందుతున్న గదిలోని గాలిలో ఆక్సిజన్ శాచ్యురేషన్ స్థాయిని 99 శాతం దగ్గర కొనసాగిస్తున్నామని చెప్పారు. గంగూలీ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు డాక్టర్లు .గత రాత్రి ఆయన బాగా నిద్రపోయారని తెలిపారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం చేశారని చెప్పారు.
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కరోనా బారిన పడటంతో..ప్రస్తుతం ఆయన కోల్ కతాలోని ఉడ్ ల్యాండ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. డాక్టర్ సరోజ్ మోండల్, డాక్టర్ సప్తర్షి బసుల వైద్య టీం గంగూలీ కి ట్రీట్ మెంట్ అందిస్తోంది.
మరిన్ని వార్తల కోసం..
కేసీఆర్ అనాలోచిత, అర్థరాత్రి నిర్ణయాలతోనే ఇబ్బందులు

