కళ్ళకింద క్యారీబ్యాగులు రాకుండా ఉండాలంటే

కళ్ళకింద క్యారీబ్యాగులు రాకుండా ఉండాలంటే

నిద్రలేమి, అధిక ఒత్తిడి, ఎక్కువగా ఏడవడం, డీహైడ్రేషన్ ఇలా రక రకాల కారణాల వల్ల కళ్లకింద క్యారీ బ్యాగులొస్తాయి. వీటిని స్టార్టింగ్​లో గుర్తించకపోతే కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది.  మరి ఆ క్యారీబ్యాగ్స్​ నుంచి బయటపడాలంటే ..శరీరంలో నీటిశాతం తగ్గితే చర్మం పొడిబారడమే కాకుండా కంటికింద ఉబ్బెత్తుగా ఉంటుంది. అందువల్ల నిద్రపోయే ముందు తగినన్ని నీళ్లు తాగాలి. రాత్రి సమయంలో ఎక్కువగా నీళ్లు తాగితే  ఇబ్బంది అవుతుంది కాబట్టి  ఒక్కసారిగా కాకుండా  కొంచెం కొంచెం తాగాలి. రోజంతా కూడా నీళ్లు తాగుతూ శరీరాన్ని హైడ్రేట్ చేసుకోవాలి.

ఆల్కహాల్, జంక్‌‌ఫుడ్

రాత్రి పడుకునే  ముందు టీవీ చూసే అలవాటు ఉంటుంది చాలామందికి. అంతేకాదు టీవీ చూస్తూ  టైంపాస్‌‌కు పాప్‌‌కార్న్, జంక్‌‌ఫుడ్ తింటుంటారు. వీటిలో అధికంగా సోడియం (ఉప్పు) ఉండటం వల్ల కళ్ల కింద ఉబ్బుగా అవుతాయి. ఇక ఆల్కహాల్​ శరీరాన్ని  డీహైడ్రేషన్‌‌కు గురిచేస్తుంది. దీంతో కళ్లు ఉబ్బుతాయి. అందుకే జంక్​ఫుడ్​, ఆల్కహాల్​కి దూరంగా ఉండాలి.

అలర్జీలు

ఇల్లు శుభ్రంగా ఉండాలి. దుమ్ము, ధూళి లేకుండా చూసుకోవాలి.  బెడ్, బెడ్‌‌షీట్లు, సోఫాలు నీట్​గా ఉండాలి. లేదంటే అలర్జీ  వల్ల కళ్లు ఉబ్బుగా మారతాయి.

ఒత్తిడి తగ్గించాలి

ఎక్కువ ఒత్తిడి వల్ల శరీరంలో సాల్ట్‌‌బ్యాలెన్స్ తప్పుతుంది. దాంతో ఉదయం కళ్లు ఉబ్బినట్లుగా ఉంటాయి. అందువల్ల ఒత్తిడికి దూరంగా ఉండాలి.

చిట్కాలు

కీరదోసని చిన్న ముక్కలుగా కట్ చేసి కంటి మీద పెట్టుకోవాలి. ఐదు నిమిషాలపాటు మర్దన చేయాలి. ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల కళ్లు అందంగా తయారవుతాయి. దీనిలో చర్మాన్ని సున్నితంగా మార్చే ఆస్ట్రిజెంట్, యంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండటం వల్ల క్యారీబ్యాగ్స్​ కూడా తగ్గుతాయి. ఉదయం లేవగానే కళ్లు ఉబ్బినట్లు ఉంటే స్టీల్ స్పూన్‌‌ను ఫ్రిజ్​లో ఉంచాలి. కొద్ది సమయం తర్వాత తీసి కళ్లమీద కొన్ని నిమిషాలపాటు మర్దన చేయడం వల్ల  కళ్ల కింద ఉబ్బు తగ్గుతుంది.