హెడ్ సెట్ తో జాగ్రత్త

హెడ్ సెట్ తో జాగ్రత్త

మొబైళ్ల వాడకం ఎంత పెరిగిందో హెడ్ సెట్ వాడకం కూడా అంతే పెరిగింది. చాలా మంది గంటల తరబడి హెడ్ సెట్ పెట్టుకునే ఫోన్ మాట్లాడతున్నారు. అప్పుడు చెవిలో పెట్టిన హెడ్ సెట్ మళ్ళీ రాత్రి నిద్రలో జారుకున్నప్పుడు కూడా ఉంటుంది. అంతలా హెడ్ సెట్ ఈ కాలంలో అత్యవసర వస్తువు అయిపోయింది. మరి అంతలా ఈ హెడ్ సెట్ వాడటం ఎంతవరకు మంచిది ? కాదని అంటున్నారు నిపుణులు.అతిగా హెడ్ సెట్ వాడకం ప్రమాదమని, చెవుడు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. హెడ్‌‌సెట్‌‌లో ఎక్కువ సేపు గడపొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరిస్తోంది. ఇయర్ ఫోన్స్‌ తో ఎక్కువ సేపు మ్యూజిక్ వినడం చాలా ప్రమాదకరం. ఎంతలేదన్నా.. వీటిని 15 నిమిషాలకు మిం చి ఎక్కువ వాడకూడదు. ఎందుకంటే ఇలా చెవుడు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. చెవుడు రావడానికి ప్రధాన కారణం వయసు పెరగడమైతే.. పెద్ద శబ్దాలు దగ్గరగా వినడం రెండో కారణం అని భారత్‌ కు చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ సంస్థ వెల్లడించింది. పెద్ద శబ్దాల వల్ల కలిగే చెవుడుకి ఎలాంటి చికిత్స, పరిష్కారం లేదు. చెవి లోపలి కణాలను సరిచెయ్యలేమని చెబుతున్నారు కూడా. అందుకే హెడ్ సెట్ వాడకం తగ్గిస్తే మంచిది