మీ మెడ మీద నల్లని మచ్చలు పోవాలంటే.. ఈ అద్భుతమైన చిట్కాలు మీకోసమే !

మీ మెడ మీద నల్లని మచ్చలు పోవాలంటే..  ఈ  అద్భుతమైన చిట్కాలు మీకోసమే !

ముఖం, కాళ్ళు, చేతులు తెల్లగా మెరుస్తున్నా మెడ మాత్రం నల్లగా ఉంటుంది. చాలామందికి, దీనికి కారణం మెడ విషయంలో పెద్దగా శ్రద్ద చూపకపోవడమే. మెడని సరిగా శుభ్రం చేసుకోకపోవడం వల్ల ఎక్కువగా ఈ సమస్య వస్తుంది. అలాగే మనం వాడే కాస్మొటిక్స్ లోని కెమికల్స్, పొల్యూషన్, డయాబెటిస్ వల్ల కూడా మెడ నల్లబడుతుంది. ఈ సలుపు పోవడానికి ఎం చేయాలంటే....

*అలోవెరా జెల్ ని మెడపై రాసి పదినిమిషాలు మసాజ్ చేయాలి. ఆ తర్వాత అరగంట పాటు ఆరనిచ్చి చల్లటి నీళ్లతో కడిగితే మెడ తెల్లబడుతుంది. అలోవెరాలోని మినరల్స్, విటమిన్స్ మెలనిన్ ఉత్పత్తిని కంట్రోల్ చేస్తాయి. దానివల్ల పిగ్మెంటేషన్ సమస్య తగ్గి మెడ మెరుస్తుంది.

*యాపిల్ సిడార్ వెనిగర్ చర్మంలోని  పిహెచ్ ని  బ్యాలెన్స్ చేస్తుంది. అంతేకాదు డెడ్ స్కిన్ సెల్స్  తొలగించి మెడని మెరిపిస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల యాపిల్ సిదార్ వెనిగర్ లో కొంచెం నీళ్లు కలపాలి. ఆ మిశ్రమంలో దూది ముంచి మెడపై రాయాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగితే మెడ తెల్లబడుతుంది.

*ఆల్మండ్ ఆయిల్లోని విటమిన్- ఈ, బ్లీచింగ్ ఏజెంట్స్ కూడా మెడ నలుపుని పోగొడతాయి. ఆల్మండ్ ఆయిల్ తో మెడని మసాజ్ చేసి కొన్ని నిమిషాలు వదిలేయాలి. శరీరం ఆయిల్ ని పూర్తిగా పీల్చుకున్నాక మెడని శుభ్రం చేసుకోవాలి.

ALSO READ : జిమ్‌కు వెళ్లే టైం లేదా ?

*పెరుగులోని నేచురల్ ఎంజైమ్స్ చర్మానికి తెలుపునిస్తాయి. రెండు టేబుల్ స్పూన్ ల తాజా పెరుగుని మెడపై రాసి పదిహేను నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే మెడ తెల్లబడుతుంది. అలాగే అలుగడ్డలో ఉండే బ్లీచింగ్ ప్రాపర్టీస్ కూడా మెడని తెల్లగా చేస్తాయి. ఆలుగడ్డ రసాన్ని మెడపై రాసి పావుగంట తర్వాత క్లీన్ చేసుకుంటే మెడ మెరుస్తుంది.