పంజాగుట్ట, వెలుగు: హెల్త్‌కేర్ అడ్మినిస్ట్రేషన్ రంగంలో నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా నిమ్స్‌లో ‘బీకాన్ 2026’ జాతీయ స్థాయి కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు మెడికల్ సూపరింటిండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఈ సదస్సు వివరాలను ఆయన వెల్లడించారు. బంజారాహిల్స్‌లోని ఆదివాసి భవన్లో మార్చి 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు ఈ సదస్సు జరుగుతుందని పేర్కొన్నారు. ఫైనాన్స్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, క్వాలిటీ అండ్ పేషెంట్ సేఫ్టీ వంటి కీలక అంశాలపై దేశవ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణులు, అడ్మినిస్ట్రేటర్లు చర్చించనున్నారు. ఆసక్తి గల వారు www.nimsbeacon.com వెబ్సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.
