బెదురులంక 2012 ట్రైలర్ రిలీజ్ చేయబోతున్న.. హీరో రామ్ చరణ్

బెదురులంక 2012 ట్రైలర్ రిలీజ్ చేయబోతున్న.. హీరో రామ్ చరణ్

కార్తికేయ(Kartikeya), నేహాశెట్టి(Neha Shetty)  జంటగా క్లాక్స్(Clax) డైరెక్షన్స్ లో రూపొందిన  చిత్రం  బెదురులంక 2012(Bedurulanka 2012). ఈ మూవీ 2012 యుగాంత ప్రచారం బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో తెరకెక్కబోతుంది. ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. బెదురులంక 2012 ట్రైలర్ ఆగస్ట్ 16న సా.4 గంటలకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల  మీదుగా రిలీజ్ చేస్తున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే  విడుదలైన ‘ద వరల్డ్ ఆఫ్ బెదురులంక’ గ్లింప్స్, ‘వెన్నెల్లో ఆడపిల్ల’  పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ మూవీ గోదావరి బేస్డ్ రూరల్ డ్రామాగా తెరకెక్కుతుంది.  

ఎల్బీ శ్రీరామ్, అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ(Manisharma) సంగీతం అందిస్తున్నారు. రవీంద్ర బెనర్జీ ముప్పానేని లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించారు. 

కార్తికేయ 2021లో వచ్చిన ‘రాజా విక్రమార్క’మూవీ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే  ‘బెదురులంక 2012’ మూవీఫై భారీ ఆశలు పెట్టుకున్నారు కార్తీకేయ.ఇక మధ్యలో తమిళ చిత్రం ‘వలిమై’లో విలన్‌గా నటించారు. స్టార్ హీరో అజిత్‌ను ఢీకొట్టారు. అంతకు ముందు తెలుగులోనూ ‘గ్యాంగ్ లీడర్’లో నానీకి విలన్‌గా నటించిన విషయం తెలిసిందే.