గండిపేట,వెలుగు: కురుమ సంఘాన్ని వెనక్కి నెట్టేందుకు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారికి కురుమ సమాజమే సరైన సమాధానం చెబుతుందని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ఫైర్అయ్యారు. గురువారం కోకాపేట నియో పోలీస్ స్టేషన్ పరిధిలోని దొడ్డి కొమురయ్య ఆత్మగౌరవ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆత్మగౌరవ భవనాన్ని లీజుకు ఇచ్చారని, తాకట్టు పెట్టారని, ట్రస్ట్ ఆస్తుల ద్వారా కొందరు వ్యక్తిగతంగా లాభపడుతున్నారని వస్తున్న ఆరోపణలు పూర్తిగా అబద్ధమని స్పష్టం చేశారు. కురుమ సమాజం ఆత్మగౌరవాన్ని మరింత పెంచేలా ట్రస్ట్ బోర్డు సభ్యులు, కుల పెద్దలు చర్చలు జరుపుతున్నారని చెప్పారు. భూములను ఎవరికీ లీజుకు ఇవ్వలేదని, రాతపూర్వకంగా అప్పగించలేదని తెలిపారు.
