స్వాతిముత్యం, నేను స్టూడెంట్ సర్ చిత్రాలతో ఆకట్టుకున్న బెల్లంకొండ గణేష్ తాజాగా తన నెక్స్ట్ ప్రాజెక్టుని అనౌన్స్ చేశాడు. న్యూఏజ్ రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందే ఈ చిత్రానికి 'తొలిప్రేమ' ఫేమ్ ఎకరుణాకరన్ దర్శకుడు. గోల్డెన్ టర్టిల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై మౌనికా రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు కేవీ అనుదీప్ డైలాగ్ రైటర్గా వర్క్ చేస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.
సోమవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ముహూర్తపు షాట్‌కు దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ కొట్టగా, అనుదీప్ కెవీ కెమెరా స్విచ్చాన్ చేశాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు దర్శకుడు తెలియజేశారు. కరుణాకరన్, అనుదీప్, భీమ్స్ కలయిక ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని నిర్మాతలు అన్నారు.

