బరువు తగ్గలాంటే.. ఇవి తినండి

బరువు తగ్గలాంటే.. ఇవి తినండి

చలికాలంలో గరంగరం శ్నాక్స్​ తినడం చాలామందికి అలవాటు. అంతేకాదు నచ్చిన ఫుడ్​ ఎక్కువగా తినడం, బోర్​డమ్, స్ట్రెస్​ వల్ల అతిగా తినడం బరువు పెరిగేలా చేస్తాయి. ఈ సీజన్​లో హెల్దీఫుడ్​​ తినడం చాలాముఖ్యం అంటున్నారు న్యూట్రిషనిస్టులు. అందుకోసం ఏం చేయాలో కూడా చెబుతున్నారు. ఫుడ్​ డైరీ
రోజూ ఏ రకం ఫుడ్​ తింటున్నారు? ఎలాంటి డ్రింక్స్​ తాగుతున్నారు? ఎంత సేపు ఎక్సర్​సైజ్​ చేస్తున్నారు.... ఈ వివరాలన్నీ  డైరీలో రాయాలి. వారం తర్వాత డైరీ తిరగేస్తే, ఏవి ఎక్కువ తింటున్నారో! ఎక్కువ తాగుతున్నారో! తెలుస్తుంది. దాంతో హెల్దీఫుడ్​ని అలవాటు చేసుకోవడం ఈజీ అవుతుంది.

వర్కవుట్​ రొటీన్​లో...
హెల్దీగా ఉండాలంటే వారానికి కనీసం రెండున్నర గంటలు  ఎక్సర్​సైజ్​లు చేయాలి. జాగింగ్, వేగంగా నడవడం వంటివి వర్కవుట్​ రొటీన్​లో ఉండాలి. రోజుకి ఎంత దూరం నడిచారో  తెలుసుకునేందుకు ‘పొడో మీటర్’ యాప్​​ సాయం తీసుకోవచ్చు. ఎన్ని క్యాలరీలు కరిగాయో? కూడా ఈ యాప్​ చెప్పేస్తుంది. 

నీళ్లు మరవొద్దు
మెటబాలిజం బాగా జరగడానికి, రోజంతా హుషారుగా ఉండడానికి నీళ్లు సరిపోను తాగాలి. రోజుకు 6–8 గ్లాసుల నీళ్లు తాగాలి. తక్కువ ఫ్యాట్​ ఉన్న పాలు, షుగర్​ ఉండని డ్రింక్స్​ కూడా హెల్త్​కు మంచివే. 

శ్నాక్స్​ ప్లాన్
మీల్స్​ బ్రేక్​లో శ్నాక్స్​ తప్పనిసరి. అయితే, అవి కూడా 100 క్యాలరీలు ఉన్న స్నాక్స్​ తినాలి. స్నాక్​గా పది బాదం పలుకులు లేదంటే ఉడకబెట్టిన గుడ్డు తింటే బెస్ట్​. 
చిన్న ప్లేట్స్​లో...
పెద్ద ప్లేట్ నిండా వడ్డించుకుని తినడం మానేయాలి. క్యాలరీలు ఎక్కువ ఉండే 
మాంసం, ఛీజ్​ వంటి వాటిని చిన్న ప్లేట్​లో వేసుకుని తినాలి. దాంతో తక్కువ తింటారు.