ఈ సీజన్‌‌‌‌‌‌‌‌ల జంతువులతో జాగ్రత్త

ఈ సీజన్‌‌‌‌‌‌‌‌ల జంతువులతో జాగ్రత్త

ప్రపంచంలో ఎక్కువగా వ్యాపించే బ్యాక్టీరియల్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌ఫెక్షన్‌‌‌‌‌‌‌‌ లెప్టోస్పిరోసిస్‌‌‌‌‌‌‌‌. లెప్టోస్పిరా జాతికి చెందిన బ్యాక్టీరియా ఈ ఇన్‌‌‌‌‌‌‌‌ఫెక్షన్‌‌‌‌‌‌‌‌కి కారణం. అందుకే  ఆ పేరు వచ్చింది. వానాకాలంలో, ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇది ఎక్కువగా వ్యాపిస్తుంది. అయితే ఇది నేరుగా మనుషులకు సోకదు. ఇది ఒక జూనోటిక్ డిసీజ్‌‌‌‌‌‌‌‌. ముందుగా జంతువులకు వాటి చర్మం, కండ్లు, చెమట ద్వారా ఈ బ్యాక్టీరియా లోపలికి ప్రవేశిస్తుంది. ఇన్‌‌‌‌‌‌‌‌ఫెక్ట్​అయిన ఆ జంతువుల యూరిన్‌‌‌‌‌‌‌‌ ద్వారా మనుషులకు సోకుతుంది. ఇందుకు నీరు, ఫుడ్‌‌‌‌‌‌‌‌ వాహకాలుగా పని చేస్తాయి. అరుదుగా మనుషుల నుంచి మనుషులకు ఈ ఇన్‌‌‌‌‌‌‌‌ఫెక్షన్‌‌‌‌‌‌‌‌ వ్యాపిస్తుంది. వీధుల్లో తిరిగే జంతువులతో పాటు పెంపుడు జంతువులకు కూడా ఈ బ్యాక్టీరియా సోకవచ్చు. కాబట్టి, పెట్స్‌‌‌‌‌‌‌‌ విషయంలో కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి.

రిస్క్‌‌‌‌‌‌‌‌ ఉంది!

మట్టి, నీళ్లలో ఈ బ్యాక్టీరియా కొన్ని వారాల నుంచి నెలల దాకా బతికే ఉంటుంది.  అక్కడి నుంచి ఎలుకలు, కుక్కలు, ఆవులు.. ఇలా అన్ని జంతువులకు  సోకుతుంది. వాతావరణంలోని మార్పులను బట్టి ఈ ఇన్‌‌‌‌‌‌‌‌ఫెక్షన్‌‌‌‌‌‌‌‌ తొందరగా మనుషులకు సంక్రమిస్తుంది.  వ్యవసాయం పనులకు వెళ్లే వాళ్లకు, పెట్‌‌‌‌‌‌‌‌షాప్‌‌‌‌‌‌‌‌ వర్కర్స్‌‌‌‌‌‌‌‌కి,  వెటర్నరీ డాక్టర్లు, సఫాయి కార్మికులకు, మాంసం దుకాణాలు నడిపేవాళ్లు, కబేళాలలో పని చేసేవాళ్లకు, మిలిటరీ సిబ్బంది, ప్రకృతి విపత్తుల సమయంలో పని చేసే సిబ్బంది..  ఎక్కువగా లెప్టోస్పిరోసిస్‌‌‌‌‌‌‌‌ బారినపడే అవకాశం ఉంది. ముఖ్యంగా వరదల టైంలో ఈ బ్యాక్టీరియా తన ప్రతాపం చూపిస్తుంది. లెప్టోస్పిరోసిస్‌‌‌‌‌‌‌‌ సోకితే సాధారణ జ్వరం లక్షణాలే కనిపిస్తాయి. కానీ, ఒక్కోసారి స్పైన్‌‌‌‌‌‌‌‌ ఫ్లూ కూడా సోకి సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది.

జాగ్రత్తలు

ప్రపంచ ఆరోగ్య సంస్థ అరుదైన ఈ బ్యాక్టీరియల్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫెక్షన్‌‌‌‌‌‌‌‌ కోసం ఎలాంటి వ్యాక్సినేషన్‌‌‌‌‌‌‌‌ నిర్వహించట్లేదు. కానీ, నేషనల్‌‌‌‌‌‌‌‌ హెల్త్‌‌‌‌‌‌‌‌ పోర్టల్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఇండియా ఈ ఇన్‌‌‌‌‌‌‌‌ఫెక్షన్‌‌‌‌‌‌‌‌ సోకకుండా కొన్ని బేసిక్‌‌‌‌‌‌‌‌ జాగ్రత్తలు పాటించాలని చెబుతోంది.

  •      ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో బయట తిరిగేటప్పుడు మాస్క్‌‌‌‌‌‌‌‌, వాటర్‌‌‌‌‌‌‌‌ఫ్రూఫ్‌‌‌‌‌‌‌‌ బట్టలు వేసుకోవడం ఉత్తమం.
  •      ఇంటి చుట్టుపక్కల నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి.
  •      నదులు, చెరువులు, స్విమ్మింగ్‌‌‌‌‌‌‌‌ పూల్.. వీటికి దూరంగా ఉండటం మంచిది.
  •      మల, మూత్ర విసర్జనల తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
  •      గాయాల విషయంలో నిర్లక్ష్యం పనికి రాదు.
  •      చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇన్‌‌‌‌‌‌‌‌ఫెక్టెడ్‌‌‌‌‌‌‌‌ జంతువులు తిరుగుతుంటే మున్సిపాలిటీకి సమాచారం అందించాలి.
  •     ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే మరింత జాగ్రత్తలు పాటించాలి. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి.  ఇన్‌‌‌‌‌‌‌‌ఫెక్షన్లు, గాయాలు         లేకుండా చూసుకోవాలి. బయటికి తీసుకెళ్లే టైంలో వాటికి కూడా మాస్క్‌‌‌‌‌‌‌‌లు వేయాలి.

లక్షణాలు

లెప్టోస్పిరోసిస్‌‌‌‌‌‌‌‌ ‘ఇంక్యుబేషన్‌‌‌‌‌‌‌‌’ పిరియడ్‌‌‌‌‌‌‌‌ ఐదు నుంచి పద్నాలుగు రోజుల వరకు ఉంటుంది. తలనొప్పి, కండరాల నొప్పి, విపరీతమైన చలి.. చిన్నపాటి జ్వరం దీని లక్షణాలు.  కానీ, కొన్ని కేసుల్లో ఇన్‌‌‌‌‌‌‌‌ఫెక్షన్‌‌‌‌‌‌‌‌ ముదిరి శరీరంలోని అవయవాల పని తీరు పని చేయకుండా పోతుంది. లేదంటే ఇంటర్నల్‌‌‌‌‌‌‌‌గా బాడీలో రక్తస్రావం జరిగే చాన్స్‌‌‌‌‌‌‌‌ కూడా ఉంది. తీవ్రమైన ఈ స్థితిని ‘వెయిల్‌‌‌‌‌‌‌‌ డిసీజ్‌‌‌‌‌‌‌‌’ అంటారు. డెంగ్యూ, టైఫాయిడ్‌‌‌‌‌‌‌‌, వైరల్‌‌‌‌‌‌‌‌ హెపటైటిస్‌‌‌‌‌‌‌‌ ఇతరత్రా జబ్బుల్లాగా లెప్టోస్పిరోసిస్‌‌‌‌‌‌‌‌ క్లినికల్ ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌తో  తగ్గదు. బ్యాక్టీరియాను గుర్తించడానికి ప్రాథమిక దశలో రక్తపరీక్ష చేస్తారు. తర్వాత ‘ఎలిసా, పీసీఆర్‌‌‌‌‌‌‌‌, మ్యాట్‌‌‌‌‌‌‌‌’ టెస్టులతో ఇన్‌‌‌‌‌‌‌‌ఫెక్షన్‌‌‌‌‌‌‌‌ని నిర్ధారిస్తారు.