IPL 2026: జురెల్, జైస్వాల్ జోరు.. వైభవ్ హోరు.. గుజరాత్ ముందు భారీ టార్గెట్!

IPL 2026: జురెల్, జైస్వాల్ జోరు.. వైభవ్ హోరు.. గుజరాత్ ముందు భారీ టార్గెట్!

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్ పోరులో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో  వికెట్ల నష్టానికి పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న రాజస్థాన్ కి అద్భుతమైన ఆరంభం లభించింది. ధ్రువ్ జురెల్ (  ) అద్భుతమైన అర్థ శతకంతో చేయగా, ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ (55) హాఫ్ సెంచరీతో చెలరేగగా, వైభవ్ సూర్యవంశీ మెరుపు బ్యాటింగ్ తో గుజరాత్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించారు. అనంతరం జైస్వాల్– సూర్యవంశీ మధ్య నెలకొన్న 70 పరుగుల భాగస్వామ్యాన్ని గుజరాత్ కెప్టెన్ రషీద్ ఖాన్ బ్రేక్ చేశాడు. 

70 పరుగుల వద్ద రషీద్ బౌలింగ్(6.2)లో గ్లెన్ ఫిలిప్స్ కి క్యాచ్ ఇచ్చిన వైభవ్ సూర్యవంశీ (18 బంతుల్లో 5 ఫోర్లు ఒక సిక్సుతో 31 పరుగులు) పెవిలియన్ కి వెళ్లిపోయాడు. అనంతరం జురెల్ తో కలిసి ఇన్సింగ్స్ ముందుకు నడిపిస్తున్న క్రమంలో జైస్వాల్ (36 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్సులతో 55 పరుగులు) తన అర్థ శతకం పూర్తి చేసుకున్న తర్వాత కగిసో రబాడా బౌలింగ్ లో క్లిన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ఆర్ఆర్ కెప్టెన్ రియాన్  పరాగ్ (8), షిమ్రాన్ హెట్‌మయర్ (18) పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఒకవైపు జురెల్ (42 బంతుల్లో 5 ఫోర్లు 5 సిక్సులతో 75 పరుగులు) మాత్రం దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ, తన హాఫ్ సెంచరీని కంప్లీట్ చేసుకున్నాడు. 

►ALSO READ | IPL 2026: జైస్వాల్, సూర్యవంశీ వైల్డ్ బ్యాటింగ్‌.. 10 ఓవర్లకే రాజస్థాన్ భారీ స్కోర్ 

ఇక జురెల్ అవుట్ అయినా తర్వాత క్రీజులోకి వచ్చిన జోఫ్రా అర్చర్, రవీంద్ర జడేజా (7*) లాస్ట్ బంతిని ఫోర్ కొట్టడంతోనిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. అలాగే గుజరాత్ బౌలర్లలో కగిసో రబాడా కీలకమైన రెండు వికెట్లు తీసుకోగా, రషీద్ ఖాన్, అశోక్ శర్మ, ప్రసిద్ కృష్ణ తలో వికెట్ పడగొట్టారు.