సౌత్‌లో అంతంతే.. నార్త్‌లో అన్నీ బంద్​

సౌత్‌లో అంతంతే.. నార్త్‌లో అన్నీ బంద్​

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది. సోమవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 దాకా సాగింది. నార్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియాలో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. సౌత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేరళ మినహా మిగతా రాష్ట్రాల్లో జనజీవనంపై అంతగా ఎఫెక్ట్ పడలేదు. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, యూపీ, కేరళ, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగాయి. రైల్వే ట్రాకులు, రాష్ట్ర, జాతీయ హైవేలను, కీలక రోడ్లను రైతులు బ్లాక్ చేశారు. వేలాది మంది నిరసనల్లో పాల్గొన్నారు. పలు ట్రైన్లు రద్దు అయ్యాయి. అంతర్రాష్ట్ర ప్రయాణికులు బార్డర్ల దగ్గరే చిక్కుకుపోయారు. నిత్యావసరాలతో వెళ్తున్న ట్రక్కులు సాయంత్రం దాకా నిలిచిపోయాయి.

ట్రేడ్ యూనియన్లు, ప్రతిపక్షాల మద్దతు

40 రైతు సంఘాలను లీడ్ చేసే సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భారత్ బంద్ జరిగింది. నిరసనలకు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆప్, ఎస్పీ, టీడీపీ, వైఎస్సార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీపీ, బీఎస్పీ, లెఫ్ట్ పార్టీలు, స్వరాజ్ ఇండియా మద్దతు పలికాయి. మద్దతుపై టీఎంసీ ఎలాంటి ప్రకటన చేయకున్నా.. ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేఎం డిమాండ్లకు సపోర్టు చేస్తున్నట్లు తెలిపింది. పార్టీ కార్యకర్తలు బంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాల్గొనాలని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కోరింది. బంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రశాంతంగా జరిగేందుకు  సహకరించాలని, సమ్మెలో పాల్గొనాలని ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేఎం విజ్ఞప్తి చేసింది. 10 గంటలపాటు సాగిన నిరసనల్లో ఎక్కడా ఎలాంటి గొడవలు జరగలే.

రైతుల పక్షాన నిలబడుత: రాహుల్ గాంధీ

అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాహుల్ గాంధీ మద్దతు ప్రకటించారు. ‘‘ఏడాదిగా రైతులు సత్యాగ్రహం చేస్తున్నారు. ఈ రోజుకూ రైతులు అంతే బలంగా ఉన్నారు. కానీ దోపిడీ ప్రభుత్వానికి అది ఇష్టంలేదు. అందుకే ఈరోజు భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’’ అని రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ట్వీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు.కాగా, తాము చేపట్టిన బంద్ విజయవంతమైందని రైతు నేత యోగేంద్ర యాదవ్ చెప్పారు. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో రైతులు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారన్నారు.

25 రైళ్లపై ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సందర్భంగా రైళ్ల రాకపోకలపై ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పడింది. ఢిల్లీ, అంబాలా, ఫిరోజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డివిజన్లలో సుమారు 20 ప్రాంతాలను రైతులు నిర్బంధించారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 4 వరకు బంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఢిల్లీ- అమృత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- ఈ- పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, న్యూఢిల్లీ- మోగా ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఓల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఢిల్లీ- పఠాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కోట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వందే భారత్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అమృత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సర్ శతాబ్డి సహా 25 రైళ్లపై బంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభావం పడిందని నార్తర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైల్వే స్పోక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. రెవారి- భివాని, భివాని- రోహ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తక్, భివాని- హిసార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హనుమాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఘర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- సదుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- శ్రీగంగానగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- ఫతూహి సెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అంతరాయం ఏర్పడిందని తెలిపారు. స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వీసులను కేన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశామని, పలు సర్వీసులను దారి మళ్లించామని నార్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెస్టర్న్ రైల్వే సీపీఆర్​వో శశికిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు.  

ఎక్కడెక్కడ ఎట్లెట్ల?

  • గ్రేటర్ నోయిడాలో వేలాది మంది రైతులు ట్రాక్టర్లు, స్కూటర్లతో ర్యాలీ తీశారు. యూపీలోని  మీరుట్, బాఘ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పట్, హాపూర్, బులంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షహర్ తదితర ఏరియాల్లోనూ ఇలాంటి ర్యాలీలే జరిగాయి. మోర్నా, జన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సాథ్, మిరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్, షాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తదితర ప్రాంతాల్లో రోడ్లను బ్లాక్ చేశారు. వైవాలా చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోస్టు దగ్గర మీరుట్- కర్నాల్ హైవే, లాలుఖేరి వద్ద ఖాతిమా-పానిపట్ హైవేపై రైతులు అడ్డుగా నిలిచారు.
  • పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని చాలా ప్రాంతాలు పూర్తిగా షట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్ అయ్యాయి. రైతుల ఆందోళనలకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ప్రకటించింది. చాలా ఏరియాల్లో షాపులు తెరుచుకోలే. 
  • హర్యానాలోని సిర్సా ఫతేహాబాద్, కురుక్షేత్రలో హైవేలను బ్లాక్ చేశారు. రైల్వే ట్రాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై బైఠాయించారు. 
  • వెస్ట్ బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జనజీవనంపై పెద్దగా ఎఫెక్ట్ పడలేదు. లెఫ్ట్ కార్యకర్తలు రోడ్లు, రైల్వే ట్రాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను బ్లాక్ చేశారు. కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతాలోని ఓ రైల్వే ట్రాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై, వెస్ట్ మిడ్నాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఐఐటీ ఖరగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్–హిజ్రి రైల్వే లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వందలాది మంది బైఠాయించారు.
  • జార్ఖండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాంచీ, దుమ్కా సహా చాలా చోట్ల వాహనాలు రోడ్డెక్కలేదు. షాపులు క్లోజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యాయి. 
  • హార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పట్నా, ఆరా, జహనాబాద్, మాధేపురలో రైల్వే లైన్లపై ఆర్జేడీ, సీపీఐ నేతలు బైఠాయించారు. రోడ్లను క్లోజ్ చేశారు. చాలా చోట్ల మార్కెట్లు ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఉన్నాయి. ఆఫీసులు కూడా నడిచాయి. ప్రైవేటు స్కూళ్లన్నీ మూతబడ్డాయి. 
  • ఒడిశాలోని భువనేశ్వర్, బాలాసోర్, రూర్కెలా, సంబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏరియాల్లో నిరసనలు జరిగాయి. 
  • కేరళలో ప్రభుత్వ, ప్రతిపక్షాలన్నీ బంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మద్దతిచ్చాయి. బస్సులు రోడ్డెక్కలే. 
  • కర్నాటకలో అన్ని వ్యాపారాలు కొనసాగాయి. సంస్థలు ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఉన్నాయి.  ఆర్టీసీ సర్వీసులు నడిచాయి.

జంతర్ మంతర్ దగ్గర..

రైతుల భారత్ బంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మద్దతుగా కొన్ని ట్రేడ్ యూనియన్లు, పౌర సంస్థలు జంతర్ మంతర్ దగ్గర ధర్నాకు దిగాయి. ‘రైతుల ఐక్యత వర్ధిల్లాలి’ అన్న బ్యానర్లను ప్రదర్శించాయి. సాగు చట్టాలను రద్దు చేయాలని, అందరికీ సమాన అవకాశాలు ఉండాలని డిమాండ్ చేశాయి. ఆలిండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ (ఏఐసీసీటీయూ), సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ), ఆలిండియా కిసాన్ సభ, జన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాదీ మహిళా సమితి, యూటీయూసీ తదితర సంఘాలు ధర్నాలో పాల్గొన్నాయి.