హైదరాబాద్, వెలుగు: భారతీయ క్లౌడ్ సేవల సంస్థ భారత్‌క్లౌడ్ తన మొదటి క్లౌడ్ సెంటర్‌ను కంట్రోల్ ఎస్ డేటాసెంటర్స్ భాగస్వామ్యంతో హైదరాబాద్ డీసీ1 సదుపాయంలో ప్రారంభించింది. సావరిన్, ఏఐ రెడీ డిజిటల్ మౌలిక వసతుల ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేయడానికి ఈ కేంద్రం తోడ్పడుతుంది.
అంతర్జాతీయ ప్రాపర్టీ కన్సల్టింగ్ సంస్థ జేఎల్ఎల్ ఈ లావాదేవీకి ప్రత్యేక సలహాదారుగా వ్యవహరించింది. రాబోయే ఐదేళ్లలో భారతదేశ వ్యాప్తంగా ఏఐ రెడీ క్లౌడ్ మౌలిక వసతులను నిర్మించడానికి భారత్‌క్లౌడ్ 100 మిలియన్ డాలర్ల (సుమారు రూ.950 కోట్లు) పెట్టుబడి పెట్టనుంది.
ఈ విస్తరణ ముంబై, ఢిల్లీ ఎన్‌సీఆర్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, పుణె వంటి ప్రధాన నగరాలతో పాటు టైర్-2, టైర్-3 నగరాల్లో ఉంటుందని భారత్ క్లౌడ్ తెలిపింది.
