V6 News

బాబా సాహెబ్ బాటలో ప్రజా ప్రభుత్వం : డిప్యూటీ సీఎం భట్టి 

బాబా సాహెబ్ బాటలో ప్రజా ప్రభుత్వం  : డిప్యూటీ సీఎం భట్టి 
  • సామాజిక న్యాయమే మా సర్కార్ మంత్రం : డిప్యూటీ సీఎం భట్టి 
  • కేంద్రంలోని బీజేపీ సర్కార్​ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తోంది 
  • ప్రజలే బుద్ధి చెప్తారని వార్నింగ్​
  • 125 అడుగుల అంబేద్కర్​విగ్రహం వద్ద నివాళి 

హైదరాబాద్‌‌‌‌ సిటీ, వెలుగు: ‘దేశానికే దిక్సూచి మన రాజ్యాంగం.. రాజ్యాంగ నిర్మాత,  భార‌‌‌‌త‌‌‌‌ర‌‌‌‌త్న డా.భీమ్​రావు అంబేద్కర్​ఆశయాలకు అనుగుణంగానే రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పాలన సాగిస్తోంది’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం పీవీ మార్గ్‌‌‌‌లో ఉన్న 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహం దగ్గర బాబా సాహెబ్ 135వ జయంతి వేడుకలు ప్రభుత్వం తరఫున అట్టహాసంగా జరిగాయి. సర్కార్ తరపున హాజరైన భట్టి.. విగ్రహానికి పూలమాల వేసి మొక్కిన్రు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి ముఖ్య​అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో ఆడబిడ్డల కష్టాలను గుర్తించిన మొదటి నాయకుడు అంబేద్కరేనని భట్టి గుర్తుచేశారు. "ఆడపిల్లలకు ఆస్తిలో వాటా ఉండాలని, సమాన హక్కులు దక్కాలని హిందూ కోడ్ బిల్లు తెచ్చాడని, అది పార్లమెంటులో అమోదం పొందకపోవడంతో తన మంత్రి పదవికే రాజీనామా చేసిన త్యాగధనుడు మన బాబా సాహెబ్" అని కొనియాడారు. ఓటు హక్కు ద్వారానే సామాన్యుడికి బలం వచ్చిందని, ప్రశ్నించే తత్వం, స్వేచ్ఛ తదితర హక్కులన్నీ రాజ్యాంగమే ఇచ్చిందని చెప్పారు.

రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.. 

కేంద్రంలోని బీజేపీ సర్కార్‌‌‌‌ "రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తుందని, ప్రజలే బుద్ధి చెప్తారని ఫైర్​అయ్యారు. కొందరు రాజ్యాంగాన్ని మార్చేస్తామంటూ మాట్లాడుతున్నారని, ఇదే జరిగితే ప్రతి పౌరుడు తమ హక్కులను కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. మనమంతా కలిసి కట్టుగా ‘జై భీమ్’ నినాదంతో రాజ్యాంగాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కొలువుదీరిన ఇందిరమ్మ ప్రభుత్వం అంబేద్కర్​ఆశయాలకు అనుగుణంగా నడుస్తుందని తెలిపారు.

జనాభా లెక్కల ప్రకారం అందరికీ వనరులు, వాటాలు పంచడమే కాంగ్రెస్​సర్కార్ లక్ష్యమని స్పష్టం చేశారు.  ముఖ్యమంత్రి రేవంత్‌‌‌‌ రెడ్డి నేతృత్వంలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్‌‌‌‌ గౌడ్‌‌‌‌ తదితరులు బాబాసాహెబ్‌‌‌‌ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అలాగే ఖైరతాబాద్‌‌‌‌ ఎమ్మెల్యే దానం నాగేందర్, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్, టీజీటీడీసీ ఎండీ గౌతమి, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్​ నర్సింహారెడ్డి, హెరిటేజ్ డైరెక్టర్ అర్జున్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న పర్యాటక ప్రదర్శనలు

అంబేద్కర్​ జయంతి సందర్భంగా పర్యాటక, పురావస్తు, భాషా సాంస్కృతిక శాఖలు, బుద్ధవనం ప్రాజెక్టు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శన స్టాళ్లను డిప్యూటీ సీఎం, మంత్రులు కలిసి ప్రారంభించారు.  తెలంగాణ వైభవాన్ని చాటిచెప్పేలా రూపొందించిన పర్యాటక ప్రదర్శనలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పర్యాటకుల అభిరుచులకు, బడ్జెట్‌‌‌‌కు అనుగుణంగా అధికారులు నూతనంగా రూపొందించిన కస్టమైజ్డ్‌‌‌‌ టూర్ ప్యాకేజీలను పరిచయం చేశారు.