బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న భూల్ భులయ్యా 2 కలెక్షన్స్..!

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న భూల్ భులయ్యా 2 కలెక్షన్స్..!

సౌత్ సినిమాలు...బాలీవుడ్ లో సత్తా చూపిస్తున్నాయి. అక్కడి ఆడియన్స్..యాక్షన్ జోనర్ లో తెరకెక్కిన..ఇక్కడి సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు. ట్రిపుల్ ఆర్, కెజియఫ్ 2, పుష్ప సినిమాలు..హిందీ ఆడియన్స్ ను ఎంతగా మెప్పించాయో తెలిసిందే. ట్రిపుల్ ఆర్ బాలీవుడ్ లో 276 కోట్ల వసూళ్లు రాబడితే..కెజియఫ్ 2 అయితే..430 కోట్లతో..బాహుబలి 2 సినిమా తర్వాత ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఇలాంటి టైమ్ లోనే..కార్తీక్ ఆర్యన్ నటించిన భూల్ భులయ్యా 2..థియేటర్లలోకి వచ్చింది. ట్రైలర్ బాగుండటంతో ఫస్ట్ నుంచే మూవీ మీద అంచనాలు పెరిగాయి.  దీంతో శుక్రవారం భూల్ భులయ్యా 2 రిలీజ్ కాగా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. క్రిటిక్స్ కూడా ఈ సినిమాకు మంచి రేటింగ్స్ ఇవ్వడంతో కలెక్షన్స్ అదిరిపోయాయి.  ఫస్ట్ డే..14 కోట్లకు పైగా వసూళ్లు దక్కించుకోవడంతో..హిందీ ఇండస్ట్రీ కూడా ఖుషీ అయితుంది. సినిమా మంచిగా ఉంటే ప్రేక్షకులు ఏ రేంజ్ లో బ్రహ్మరథం పడతారో భూల్ భూలయ్యా 2 నిరూపించిందంటున్నారు ఫ్యాన్స్.

కొంత కాలంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కుంటున్న బాలీవుడ్ ఇండస్ట్రీకి ఈ సినిమా హిట్ తో మంచి రోజులు రాబోతున్నాయని బాలీవుడ్ టాక్. సౌత్ స్టార్స్..బాలీవుడ్ స్టార్స్ గా మారిపోతుంటే..హిందీ స్టార్లు మాత్రం బాక్సాఫీసు ముందర చతికిల పడుతున్న విషయం తెలిసిందే.  కొంత కాలంగా ఈ స్టార్లు నటించిన సినిమాలు మంచి వసూళ్లు రాబట్టలేకపోతున్నాయి. అక్షయ్ బచ్చన్ పాండే, జాన్ అబ్రహాం అటాక్ 2, షాహిద్ కపూర్ జెర్సీ, అజయ్ దేవగన్ రన్ వే 34,టైగర్ ష్రాఫ్.. టైగర్ 2 లాంటి సినిమాలు అపజయాల పాలయ్యాయి. మినిమం వసూళ్లు కూడా రాబట్టలేకపోయాయి. ఇలాంటి టైమ్ లోనే..కార్తీక్ ఆర్యన్ నటించిన భూల్ భులయ్యా 2..థియేటర్లలోకి వచ్చి సక్సెస్ కావడంతో పలువురు బాలీవుడ్ స్టార్స్ ట్విట్టర్ లో సంతోష్ వ్యక్తం చేస్తున్నారు. ఫెంటాస్టిక్ ఫస్ట్ డే కలెక్షన్స్ అంటూ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. భూల్ భులయ్యా 2లో కార్తీక్ ఆర్యన్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా.. అలనాటి అందాల తార టబు కీలక పాత్రలో ఆకట్టుకుంది.