అంతర్జాతీయ పరిణామాలతో బంగారం ధరలు ఊహలకు అందని విధంగా రోజురోజుకూ మారిపోతున్నాయి. త్వరలోనే స్వచ్ఛమైన గోల్డ్ గ్రాముకు రూ.16వేల మార్కును చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తోందని బులియన్ మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలో రిటైల్ ఆభరణాల షాపింగ్ చేయాలని భావిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ నగరాల్లోని మారిన రేట్లను పరిశీలించి ముందుకు వెళ్లటం మంచిది.
సెప్టెంబర్ 23న బంగారం రేట్లు మళ్లీ పెరిగాయి. సెప్టెంబర్ 21 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా రూ.87 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 420గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 135గా కొనసాగుతోంది.
బుధవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. సెప్టెంబర్ 23, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా ఉన్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి కేజీ రేటు రూ.2లక్షల 55వేలుగా మార్పు లేకుండా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.255 దగ్గర ఉంది.
