15 నెలలుగా వేతనాలు రావట్లే..భూ భారతి ఔట్‌‌ సోర్సింగ్‌‌ ఆపరేటర్ల ఆవేదన

15 నెలలుగా వేతనాలు రావట్లే..భూ భారతి ఔట్‌‌ సోర్సింగ్‌‌ ఆపరేటర్ల ఆవేదన

హైదరాబాద్, వెలుగు: గత 15 నెలలుగా వేత నాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని భూ భారతి ఔట్‌‌ సోర్సింగ్ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా భూభారతి సేవల్లో పనిచేస్తున్న 636 మంది ఔట్‌‌సోర్సింగ్ సిబ్బందికి సంబంధించి ప్రభు త్వం దాదాపు రూ.20 కోట్ల మేర వేతన బకా యిలు చెల్లించాల్సి ఉంది.

ఒక్కో ఆపరేటర్‌‌కు నెలకు రూ. 22 వేల చొప్పున వేతనం నిర్దేశించగా.. గత 15 నెలలుగా జీతాలు నిలిచిపోవడంతో ఒక్కో ఉద్యోగికి రూ.3.30 లక్షలు రావాల్సి ఉంది. కాగా, ఇన్నాళ్లుగా అందించిన సేవలను గుర్తించి వేతన బకాయిలు విడుదల చేయడంతో పాటు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆపరేటర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.