భూటాన్‌లో లాక్‌డౌన్ ప్రకటించిన ప్రధాని

భూటాన్‌లో లాక్‌డౌన్ ప్రకటించిన ప్రధాని
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో డిసెంబర్ 23 మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా ఏడు రోజుల లాక్‌డౌన్ విధిస్తున్నట్లు భూటాన్ ప్రధాని లోటే షెరింగ్ ప్రకటించారు. డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 29 వరకు ఏడు రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేయబడుతుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి ఈ లాక్‌డౌన్ ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ‘ఈ ఉదయం నుంచి విధించిన జిల్లాల రాకపోకల బంద్‌కు కొనసాగింపుగా మరిన్ని కఠినమైన చర్యలు తీసుకోవాలి. థింఫు మరియు పారోలోని ఫ్లూ క్లినిక్‌లతో పాటు లామోయిజింగ్ఖాలో చెదురుమదురు కేసులను గుర్తించిన తర్వాత లోకల్ ట్రాన్స్‌మిషన్ తగ్గించడం కోసం మరిన్ని కఠినమైన చర్యలు తీసుకోవలసిందిగా కరోనా టాస్క్‌ఫోర్స్ నిర్ణయించింది’ అని స్టేట్‌మెంట్‌లో ప్రకటించారు. డిసెంబర్ 22న ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చిన బులెటిన్ ప్రకారం.. దేశంలో ఇప్పటివరకు 479 కరోనా కేసులు నమోదు కాగా.. వాటిలో 430 మంది కోలుకున్నారు. కాగా.. భూటాన్‌లో ఇప్పటివరకు ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదు. నిత్యావసర దుకాణాలు మరియు అవసరమైన సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాగా.. పాఠశాలలు, సంస్థలు, కార్యాలయాలు మరియు వ్యాపార సంస్థలు మూసివేయబడతాయి. మండలాల్లో రేపటి నుంచి ఏదైనా గుర్తింపు కార్డుతో నిత్యావసరాల కోసం బయటకు రావొచ్చని అధికారులు తెలిపారు. అయితే ఐసోలేషన్‌లో ఉన్న ఇళ్లకు మాత్రం ఈ సడలింపు వర్తించదని అధికారులు తెలిపారు. For More News.. ‘సూపర్-స్ప్రెడర్’గా మారిన కొత్త వైరస్ లాక్‌డౌన్‌తో వాయిదా పడ్డ మర్డర్ ప్లాన్.. నిలిచిన రెండు ప్రాణాలు తెలుగును అధికార భాషగా ప్రకటించిన బెంగాల్ ప్రభుత్వం