యాదాద్రి, వెలుగు : బస్వాపురం రిజర్వాయర్కు ఫండ్స్ రిలీజ్ చేసిన మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఫండ్స్ రిలీజ్ చేయడం వల్ల పెండింగ్‌లో ఉన్న పనుల్లో కొన్నింటిని పూర్తి చేసి నీరు విడుదల చేసి చెరువులు నింపామని చెప్పారు. బస్వాపురం రిజర్వాయర్‌పై ఎమ్మెల్యే కుంభం అసెంబ్లీలో మాట్లాడారు. గత ప్రభుత్వం రిజర్వాయర్‌ను నిర్లక్ష్యం చేసిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫండ్స్ రిలీజ్ చేసిందన్నారు. నిర్వాసితులకు రూ. 30 కోట్లు అందించామని చెప్పారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం మరో రూ. 134 కోట్లు అందించాల్సి ఉందని ఆయన తెలిపారు.
