పోలీస్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ఆగస్టు 19 నుంచి అప్లికేషన్ల స్వీకరణ

పోలీస్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ఆగస్టు 19 నుంచి అప్లికేషన్ల స్వీకరణ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌,వెలుగు: పోలీస్‌‌‌‌‌‌‌‌, స్పెషల్‌‌‌‌‌‌‌‌ పోలీస్‌‌‌‌‌‌‌‌, అగ్నిమాపకశాఖ, జైళ్లశాఖల్లోని  7,437 పోస్టుల భర్తీకి ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ దరఖాస్తు తేదీలను, దరఖాస్తు ఫీజులను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌‌‌‌‌‌‌‌ నియామక మండలి (టీఎస్‌‌‌‌‌‌‌‌ఎల్పీఆర్బీ) వెల్లడించింది. ఆగస్టు 19వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ దరఖాస్తులను స్వీకరించనుంది. ఈ మేరకు టీఎస్‌‌‌‌‌‌‌‌ఎల్పీఆర్బీ ఛైర్మన్‌‌‌‌‌‌‌‌ వీవీ శ్రీనివాసరావు శనివారం ఒక ప్రటకన జారీ చేశారు. 

అర్హులైన అభ్యర్థులు టీఎస్‌‌‌‌‌‌‌‌ఎల్పీఆర్బీ అధికారిక వెబ్‌‌‌‌‌‌‌‌సైట్ www.tgprb.in ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇతర మార్గాల్లో పంపిన దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించబోమని స్పష్టం చేశారు. కాగా, కేటగిరీల వారిగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ600, రూ.750, ఇతరులకు రూ.1200, రూ.1500 ఫీజు నిర్ణయించారు. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో ఫీజుల వివరాలు అందుబాటులో ఉన్నట్లు బోర్డ్ చైర్మన్‌‌‌‌‌‌‌‌ వెల్లడించారు.

 ‘ మెకానిక్/డ్రైవర్ పోస్టులకు ఫిజికల్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు టెస్ట్/డ్రైవింగ్ టెస్ట్ ఉంటాయి. – ఫిజికల్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌లో అర్హత పొందిన అభ్యర్థులకు రాత పరీక్ష ఉంటుంది.  నియామక ప్రక్రియలో వివిధ దశల్లో బయోమెట్రిక్ నమోదు తప్పనిసరి. పార్ట్–1 ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ దరఖాస్తు నింపే ముందు ఆధార్ ఫేస్ ఆథెంటికేషన్ కోసం గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుంచి ఆధార్ యాప్‌‌‌‌‌‌‌‌ను డౌన్‌‌‌‌‌‌‌‌లోడ్ చేసుకోవాలి’ అని ప్రకటనలో పేర్కొన్నారు.