నెంబర్ ప్లేట్ లేకుండా బైక్ స్టంట్స్

 నెంబర్ ప్లేట్ లేకుండా బైక్ స్టంట్స్
  • ర్యాష్ డ్రైవంగ్ తో హడలెత్తిపోయిన ఇతర వాహనదారులు

హైదరాబాద్: ఎస్.ఆర్ నగర్ లో నెంబర్ ప్లేట్ లేకుండా ఓ యువకుడు బైక్ స్టంట్స్ చేస్తూ హల్ చల్ చేశాడు. రోడ్డుపై ర్యాష్ డ్రైవింగ్ తో ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగించాడు. అమీర్ పేట ఎస్.ఆర్ నగర్ లో బైక్ విన్యాసాలు చేసిన విజువల్స్ ని ఇతరులు చిత్రీకరించారు. అయితే బైక్ కి నంబర్ ప్లేట్ లేదు. దీంతో ఆ యువకుడ్ని ఎలా పట్టుకోవాల్నో పోలీసులకు సవాల్ గా మారుతోంది. సీసీ కెమెరాల ఆధారంగా యువకుడ్ని పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు.