పార్ట్​టైం జాబ్ ​పేరుతో రూ.24లక్షలు కొట్టేసిన్రు

పార్ట్​టైం జాబ్ ​పేరుతో రూ.24లక్షలు కొట్టేసిన్రు

బషీర్ బాగ్, వెలుగు : పార్ట్‌‌టైం జాబ్‌‌ పేరుతో సైబర్​నేరగాళ్లు ఓ మహిళ నుంచి రూ.24లక్షలు కొట్టేశారు. హైదరాబాద్ సైబర్‌‌ క్రైమ్‌‌ ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం.. సిటీకి చెందిన మహిళ(35) టెలిగ్రామ్ అకౌంట్​కు పార్ట్‌‌ టైం జాబ్​పేరుతో ఓ మెసేజ్‌‌ వచ్చింది. స్పందించిన ఆమెకు యూట్యూబ్‌‌, ఇతర సోషల్‌‌ యాప్స్​లో లైకులు, సబ్‌‌స్క్రిప్షన్లు చేస్తే ఈజీగా డబ్బు సంపాదించవచ్చని సైబర్​నేరగాళ్లు నమ్మించారు.

మొదట కొన్ని టాస్క్‌‌లు ఇచ్చి, కొంత మేర డబ్బు పంపించారు. తర్వాత చెప్పినంత పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మబలికారు. మహిళ నుంచి విడతల వారీగా మొత్తం రూ.24,33,000 కొట్టేశారు. తర్వాత ఎంతకీ డబ్బు తిరిగి రాకపోవడంతో మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు సైబర్‌‌ క్రైమ్‌‌ పోలీసులను ఆశ్రయించింది.