ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చా: గడ్డం వంశీకృష్ణ

ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చా: గడ్డం వంశీకృష్ణ

మంచిర్యాల: ఇప్పటివరకు విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాను.. ఇప్పుడు ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. తాను సొంతంగా సోలార్ బైక్ కంపెనీ ఏర్పాటు చేసి 500 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించానని అందులో సింగరేణి కార్మికుల పిల్లలు ఎక్కువగా ఉన్నారని వంశీకృష్ణ అన్నారు.

 
ఎంపీగా వివేక్ వెంకటస్వామి..రామగుండం ఎరువుల కర్మాగారాన్ని తీసుకువస్తే అందులో బీఆర్ ఎస్ నేతలు ఉద్యోగాలను అమ్ముకున్నారని వంశీకృష్ణ అన్నారు.పెద్దపల్లి ఎంపీగా గెలిపిస్తే ప్రజలకు అనేక సేవాకార్యక్రమాలు చేపడతామన్నారు.   

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెల్లింపల్లి పట్టణంలో పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ  మార్నింగ్ వాక్ ప్రచారం నిర్వహించారు. తిలక్ స్టేడియంలో మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి క్రికెట్ ఆడారు. అనంతరం  బెల్లంపల్లిలో అభివృద్ది జరగాలంటే తనను గెలిపించాలని తనను గెలిపించాలని కోరారు.అనంతరం కూరగాయల మార్కెట్ లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కూరగాయాలు, పండ్ల వ్యాపారులను  కోరారు. కాంటా చౌరస్తాలో నిత్య జనగణమన కార్యక్రమంలో పాల్గొని గీతాలాపన చేశారు. 

బెల్లంపల్లి పట్టణంలో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి,  మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావు, మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వ్యాపారస్తులు, రోజువారి కూలీలు పాల్గొన్నారు