నాలుగో దశలో 20 శాతం మంది నేరచరితులు

నాలుగో దశలో 20 శాతం మంది నేరచరితులు

న్యూఢిల్లీ: 2024 లోక్​సభ ఎన్నికల్లో నాలుగో దశలో బరిలో నిలిచిన 20% మంది క్యాండిడేట్లకు నేరచరిత ఉందని ది అసోసియేషన్​ ఫర్​ డెమొక్రటిక్​ రీఫార్మ్స్​(ఏడీఆర్​) పేర్కొన్నది. ఈ దశలో దేశవ్యాప్తంగా వివిధ లోక్​సభ స్థానాలనుంచి1,710 మంది పోటీలో ఉండగా..వారిలో 360మందిపై క్రిమినల్​ కేసులున్నాయి. అలాగే, 24 మంది తమకు ఎలాంటి ఆస్తులు లేవని అఫిడవిట్​లో పేర్కొన్నారు.

ఈ నెల 13న ఎన్నికలు జరుగనున్న లోక్​సభ స్థానాల్లోని అభ్యర్థుల అఫిడవిట్లను ఏడీఆర్​ విశ్లేషించింది. ఈ దశలో రూ.5,700 కోట్ల ఆస్తితో రిచెస్ట్​ క్యాండిడేట్​గా తెలుగు దేశం పార్టీ (టీడీపీ)కి చెందిన డాక్టర్​ చంద్రశేఖర్​ పెమ్మసాని నిలిచారు. నేరచరితగల 360 మందిలో 17 మంది అభ్యర్థులు దోషులుగా తేలారు. మరో 11 మందిపై హత్య, 30 మందిపై హత్యాయత్నం కేసులు ఉన్నాయి. 50 మంది క్యాండిడేట్లు మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఎదుర్కొంటున్నారు. ఐదుగురు అభ్యర్థులపై లైంగిక దాడికి సంబంధించిన ఆరోపణలున్నాయి.