హెల్మెట్ పెట్టుకుంటే ఎన్నిసార్లైనా సేఫే

హెల్మెట్ పెట్టుకుంటే ఎన్నిసార్లైనా సేఫే

కొన్ని ప్రమాదాలు భయాన్ని కలిగిస్తాయి.. మరికొన్ని ప్రమాదాలు నవ్వులు తెప్పిస్తాయి. ఢిల్లీ పోలీసులు ట్వీట్ చేసిన ఓ వీడియో కూడా అందరికీ నవ్వులు తెప్పిస్తోంది. ఈ ట్వీట్ కు హెల్మెట్ పెట్టుకున్న వాళ్లను దేవుడు రక్షిస్తాడని క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియోలో ఏముందంటే.. స్పీడ్ గా వస్తున్న ఓ బైక్ కారును తప్పించబోయి డివైడర్ మధ్యలో ఉన్న పోల్ను ఢీకొట్టాడు. అయితే హెల్మెట్ పెట్టకున్న అతడికి  పెద్దగా గాయాలేమి కాలేదు. 

పైకిలేస్తుండగా పోల్ అతడిపై పోల్ పడింది. ఇప్పుడు కూడా హెల్మెట్ ఉండడంతో అతడి తలకు పెద్దగా దెబ్బ తాకలేదు. ఈ వీడియోను పోలీసులు ట్వీట్ చేస్తూ.. హెల్మెట్ పెట్టుకుంటే ఒకసారి, రెండు సార్లు కాదు ఎన్నిసార్లైనా సురక్షితంగా ఉంటారంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోకు 5 వేలకుపైగా రీట్వీట్లు, 26వేలకు పైగా లైకులు, వచ్చాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం సురక్షితమైన హెల్మెట్ ధరించడం వల్ల 64శాతం మరణాలు, 74శాతం బ్రెయిన్ ప్రమాదాలను నివారించవచ్చట.