కేసు పరిష్కారానికి రూ.2 వేల 648 కోట్లు చెల్లింపు... ప్రకటించిన అదానీ గ్రూప్

కేసు పరిష్కారానికి రూ.2 వేల 648 కోట్లు చెల్లింపు... ప్రకటించిన అదానీ గ్రూప్

న్యూఢిల్లీ: ఇరాన్ నుంచి గ్యాస్ ​కొనుగోలు చేసినందుకు అమెరికా ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ పెట్టిన  కేసు పరిష్కారానికి అదానీ గ్రూపు 275 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.2,648 కోట్లు) చెల్లించింది. గుజరాత్ లోని ముంద్రా పోర్ట్ ద్వారా ఇరాన్ నుంచి ఎల్పీజీ దిగుమతులకు సంబంధించిన నిబంధనల ఉల్లంఘనలపై ఈ విచారణ జరిగింది. 

దుబాయ్ వ్యాపారి నుంచి ఒమన్, ఇరాక్ గ్యాస్ అని భావించి కొనుగోలు చేసిన ఎల్పీజీ నిజానికి ఇరాన్ నుంచి వచ్చినట్లు తేలింది. అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్ లిమిటెడ్ (ఏఈఎల్) స్వచ్ఛందంగా ఈ వివరాలను వెల్లడించి, దర్యాప్తునకు సహకారం అందించింది. ఈ ఒప్పందం తప్పును అంగీకరించినట్లు కాదని స్పష్టం చేసింది.