ఫ్లిప్‌‌‌‌‌‌‌‌కార్ట్ బోర్డు నుంచి తప్పుకున్న బిన్నీ బన్సాల్

ఫ్లిప్‌‌‌‌‌‌‌‌కార్ట్ బోర్డు నుంచి తప్పుకున్న బిన్నీ బన్సాల్

న్యూఢిల్లీ: సుమారు 16 ఏళ్ల పాటు ఫ్లిప్‌‌‌‌‌‌‌‌కార్ట్‌‌‌‌‌‌‌‌ బోర్డులో కొనసాగిన కంపెనీ ఫౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిన్నీ బన్సాల్‌‌‌‌‌‌‌‌ తాజాగా బయటకొచ్చేశారు. కంపెనీ సమర్ధవంతులైన చేతుల్లో ఉందని తెలిశాక బోర్డు నుంచి తప్పుకుంటున్నానని ఆయన వెల్లడించారు. ఫ్లిప్‌‌‌‌‌‌‌‌కార్ట్‌‌‌‌‌‌‌‌కు తన సపోర్ట్ ఉంటుందని అన్నారు. ఫ్లిప్‌‌‌‌‌‌‌‌కార్ట్‌‌‌‌‌‌‌‌లో 77 శాతం వాటాను 16 బిలియన్ డాలర్లకు 2018 లో వాల్‌‌‌‌‌‌‌‌మార్ట్ కొనుగోలు చేసింది.

ఫ్లిప్‌‌‌‌‌‌‌‌కార్ట్ మరో ఫౌండర్ సచిన్ బన్సాల్‌‌‌‌‌‌‌‌ డీల్‌‌‌‌‌‌‌‌లో భాగంగా కంపెనీ నుంచి అప్పుడే తప్పుకున్నారు. ఆ తర్వాత నవీ ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేశారు.  బిన్నీ బన్సాల్ తాజాగా అప్‌‌‌‌‌‌‌‌డోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనే స్టార్టప్‌‌‌‌‌‌‌‌ను పెట్టారు. ఆయన ఫోన్‌‌‌‌‌‌‌‌పే బోర్డులో కొనసాగుతున్నారు.