నెహ్రూ  జూపార్కులో బర్డ్ వాక్ 

 నెహ్రూ  జూపార్కులో బర్డ్ వాక్ 

నెహ్రూ జూలాజికల్ పార్క్‌‌లో మంగళవారం బర్డ్ వాక్ సదస్సు నిర్వహించారు. హైదరాబాద్‌‌ బర్డింగ్‌‌ పాల్స్‌‌కు చెందిన సుమారు 50 మంది పక్షి వీక్షకులు జూను సందర్శించారు. కింగ్‌‌ఫిషర్‌‌, గుడ్లగూబ, డ్రాంగో, బాబ్లర్స్‌‌, గ్రే హార్న్‌‌బిల్‌‌, మూర్హెన్‌‌, మునియాస్‌‌, కోయెల్‌‌, పెయింటెడ్‌‌ స్టార్క్‌‌, ఐబిస్‌‌, ఎగ్రెట్స్‌‌, బీ ఈటర్స్‌‌, కామన్‌‌ క్రో, స్టిల్ట్స్‌‌, ల్యాప్‌‌వింగ్‌‌ తదితర పక్షులు వీక్షకులను కనువిందు చేశాయి. జూ ప్రాంగణంలో సుమారు 70 రకాల పక్షి జాతులు ఉన్నట్లు డిప్యూటీ క్యూరేటర్​ మురళీధర్​ తెలిపారు.  – ఓల్డ్​ సిటీ, వెలుగు