విద్యా శాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి రిజైన్ చేయాలి : ఎన్‌‌‌‌. రాంచందర్‌‌‌‌‌‌‌‌ రావు

విద్యా శాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి రిజైన్ చేయాలి : ఎన్‌‌‌‌. రాంచందర్‌‌‌‌‌‌‌‌ రావు
  •     జెన్‌‌‌‌జీని మోసం చేసేందుకే 21 ఏండ్ల వయసు డ్రామా: ఎన్‌‌‌‌. రాంచందర్‌‌‌‌‌‌‌‌ రావు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే తన వద్ద ఉన్న విద్యా శాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ స్టేట్‌‌‌‌ చీఫ్‌‌‌‌ ఎన్.రాంచందర్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడిచినా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, విద్యా రంగం కుదేలైందని ఆరోపించారు. 

సోమవారం పార్టీ స్టేట్‌‌‌‌ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, నెరవేర్చని గ్యారంటీలను జెన్-జీ యువత ప్రశ్నిస్తుందనే భయంతోనే రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చారని విమర్శించారు. ఎన్నికల్లో పోటీ చేసే వయసును 25 ఏండ్ల నుంచి 21 ఏండ్లకు తగ్గించాలనే ప్రతిపాదన ప్రజల దృష్టిని మళ్లించే డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమేనని చెప్పారు. శాసనసభ్యుడికి అనుభవం ఉండాలనే ఉద్దేశంతోనే రాజ్యాంగంలో అంబేద్కర్ 25 ఏండ్ల నిబంధన పెట్టారని గుర్తుచేశారు. 

యువతపై అంత ప్రేమ ఉంటే.. ముందుగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవి నుంచి మల్లికార్జున్ ఖర్గేను తప్పించి ఏ యువకుడికైనా ఆ బాధ్యతలు ఇవ్వాలని డిమాండ్‌‌‌‌ చేశారు. విద్యా శాఖ నిర్వహణలో విఫలమైన రేవంత్ రెడ్డి.. ఆ పదవిని యువ ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డికి అప్పగించాలని సూచించారు. కాగా, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా రాంచందర్ రావు ఆయనకు నివాళులర్పించారు. అనంతరం జేఎన్‌‌‌‌టీయూ ప్రొఫెసర్లు మల్లికార్జున్, సుజాత రచించిన ‘శ్రీమన్ భగవద్గీత’పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, రాష్ట్ర కార్యదర్శి కొప్పు భాష తదితరులు పాల్గొన్నారు. 

హైడ్రాను ఎత్తివేయాలి 

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌‌‌‌ను ఆ పదవి నుంచి తొలగించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు రేవంత్ రెడ్డి సర్కార్‌‌‌‌కు చెంపపెట్టు అని రాంచందర్ రావు అన్నారు. ఈ చారిత్రాత్మక తీర్పును స్వాగతిస్తున్నామని, అక్రమ నిర్మాణాల పేరుతో సామాన్య ప్రజలను, రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్న హైడ్రాను రద్దు చేయాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాజ్యాంగ విలువలని, చట్టాలను బేఖాతరు చేస్తూ ఏకంగా 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఎదుర్కొంటున్నారంటే అధికారుల బరితెగింపు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందని పేర్కొన్నారు.