CAA పై ప్రజలకు ఎలాంటి ఆందోళన అవసరం లేదు: నడ్డా
పాక్ లో మైనార్టీలపై జరుగుతున్న దాడులకు గురుద్వారా ఘటనే నిదర్శనం: MP మీనాక్షి లేఖి
ఎన్నికల్లో ఇచ్చిన హామీల నుంచి దృష్టి మరల్చేందుకే CAA: గులాం నబీ
వేరే దేశస్తులను గుర్తించి తొలగించేందుకే NPR, NRC: చిదంబరం
పౌరసత్వ చట్టానికి అనుకూల, వ్యతిరేక ప్రదర్శనలు కొనసాగుతూనే ఉన్నాయి. బీజేపీ ముఖ్యనేతలంతా ప్రజలకు అవగాహన కల్పించే పనుల్లో బిజీగా ఉన్నారు. దేశంలో ఉన్నవారికి ఎలాంటి ఆందోళన అవసరం లేదంటున్నారు. అపోజిషన్ నేతలు మాత్రం.. చట్టంతో ప్రమాదం పొంచి ఉందంటున్నారు.
CAA పై ప్రజలకు ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు BJP నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగత్ ప్రకాశ్ నడ్డా. గౌహతిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. పొరుగు దేశాల నుంచి ఇప్పటికే వచ్చి దేశంలో శరణార్థులుగా ఉన్నవారికి తాము పౌరసత్వం ఇవ్వబోతున్నామన్నారు.
పాకిస్థాన్ లో మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయనడానికి గురుద్వారాపై జరిగిన దాడే నిదర్శనమన్నారు BJP ఎంపీ మీనాక్షి లేఖి. ఇతర మతాల వారిపై దాడులు చేస్తూ.. మత మార్పిడులు చేస్తున్నారన్నారు. CAA ను వ్యతిరేకిస్తున్న వారు.. పాక్ లో గురుద్వారాపై దాడి జరిగితే ఎక్కడికెళ్తారని ప్రశ్నించారు.
సిటిజెన్ షిప్ యాక్ట్ అమలు చేయబోమంటున్న రాష్ట్రాల విషయంలో కాంట్రవర్సియల్ కామెంట్స్ చేశారు BJP MP ఉదయ్ ప్రతాప్ సింగ్. చట్టాన్ని అమలు చేయని రాష్ట్రాల్లో వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలన్నారు. పార్లమెంట్ చేసిన చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత అన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు.
కర్ణాటకలోని కోలార్లో CAA కు అనుకూలంగా ప్రదర్శన చేపట్టిన వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడటంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పారు.
CAA వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్న వారిని యూపీ పోలీసులు తీవ్రంగా హింసించారని ఆరోపించారు ప్రియాంక గాంధీ. మదర్సాల్లో ఉన్న పిల్లలను కూడా కారణాలు చెప్పకుండా పోలీసులు తీసుకెళ్లారని ఆరోపించారు. వారిలో కొందరు రిలీజ్ అయ్యారని, మరికొందరు ఇంకా పోలీస్ కస్టడీలోనే ఉన్నారని చెప్పారు. యూపీలోని ముజఫర్ నగర్, మీరట్లో పర్యటించిన ఆమె CAA వ్యతిరేక నిరనసల్లో పాల్గొని చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించారు.
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశమంతా ఒక్కటైందన్నారు రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్. మతాలు, ప్రాంతాలకతీతంగా ప్రజలు నిరసన తెలుపుతున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల నుంచి దృష్టి మరల్చేందుకే ఇలాంటి చట్టాలు తీసుకొస్తున్నారని విమర్శించారు.
NPR, CAA.. కవలలలాంటివన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం. ఇతర దేశస్తులను గుర్తించి తొలగించేందుకే NPR, NRC తీసుకొచ్చారన్నారు. CAA తో పొరుగుదేశంలో ఉన్నవాళ్లకు పౌరసత్వం ఇస్తారని చెప్పారు. తాము ఎవరినీ రెచ్చగొట్టడం లేదని.. CAAపై తమ విధానాలు నచ్చినవాళ్లే కలిసి వస్తున్నారన్నారు.

