ఈ నెల 10న రాష్ట్ర బంద్ కు బీజేపీ పిలుపు

ఈ నెల 10న రాష్ట్ర బంద్ కు బీజేపీ పిలుపు

ఈ నెల(జనవరి) 10న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది భారతీయ జనతా పార్టీ.  ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేక జీవో అక్రమ అరెస్టులు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని నిర్ణయించింది. TRS ప్రభుత్వం  ఇటీవల తీసుకొచ్చిన 317 జీవోను పునఃసమీక్షించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.  అంతేకాదు .. ఇందుకు నిరసనగా ఆందోళన చేస్తున్నబీజేపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని ఆ నేతలు ఆరోపిస్తున్నారు.

317 జీవోను పునః సమీక్షించాలని దీక్ష చేపట్టిన బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు ఆయనతో పాటు వివిధ ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్న బీజేపీ శ్రేణులపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలపాలని బీజేపీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈనెల 10న తెలంగాణ బంద్‌కు BJPపిలుపునిచ్చింది. 

మరిన్ని వార్తల కోసం..

కేసీఆర్ ఉద్యోగులను, రైతులను మోసం చేస్తుండు