రైతులకు ఉపయోగపడేలా కేంద్ర బడ్జెట్: వివేక్ వెంకటస్వామి

రైతులకు ఉపయోగపడేలా కేంద్ర బడ్జెట్: వివేక్ వెంకటస్వామి

కేంద్ర ప్రభుత్వం  ప్రవేశ పెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు ఉపయోగపడేలా ఉందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రధాని మోడీకి అభినందనలు తెలిపిన ఆయన..  ప్రపంచలోనే ఇంత మంచి బడ్జెట్ ఎక్కడా చూడలేదన్నారు. మోడీ ప్రధాని  కాక ముందుకు రెండు ట్రిలియన్ డాలర్స్ ఉండే బడ్జెట్.. ఇప్పుడు మూడు ట్రిలియన్ డాలర్స్ కి పెరిగిందన్నారు.  రైతులకు ఈ బడ్జెట్ లో  రూ. 20 లక్షల కోట్లు కేటాయించారని తెలిపారు. రైతుల కోసం స్టోరీస్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేశారని అన్నారు.  డిజిటలైజేషన్ రావడం ద్వారా ఏ పంట వేస్తే బాగుంటుందో రైతులకు తెలుస్తుందన్నారు.

సీనియర్ సిటిజన్లకు కూడా ఈ బడ్జెట్లో మేలు జరిగిందని వివేక్ వెంకటస్వామి అన్నారు.  రైల్వే కోసం రెండు లక్షలకు పైగా నిధులు కేటాయించారని తెలిపారు. ట్రైబల్స్  చదువు కోసం స్కిల్స్ కోసం నిధులు కేటాయించారని చెప్పారు.  వేతన జీవులకు ఇన్కమ్ టాక్స్ సర్దుబాటు చేశారని తెలిపారు. ప్రధాని మోడీ కొవిడ్ టైంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లారని వివేక్ వెంకటస్వామి అన్నారు.  కొవిడ్ సమయంలో 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు పంపిణీ చేశారని చెప్పారు.