‘తుపాకుల ఎమ్మెల్యే’పై పడింది వేటు

‘తుపాకుల ఎమ్మెల్యే’పై పడింది వేటు

ఢిల్లీ: తుపాకులతో చిందేసిన ఉత్తరాఖండ్‌‌ ఎమ్మెల్యే ప్రణవ్‌‌ సింగ్‌‌ చాంపియన్‌‌ను బీజేపీ ఆరేళ్లు పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీ మీడియా హెడ్‌‌, రాజ్యసభ మెంబర్‌‌ అనిల్ బలూని బుధవారం మాట్లాడుతూ దుష్ప్రవర్తన, వరుసగా చేస్తున్న ప్రజామోదయోగ్యం కాని పనుల కారణంగా అతనిపై వేటు వేస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ప్రణవ్‌‌ సింగ్‌‌ తుపాకులు పట్టుకొని డ్యాన్స్‌‌ చేసిన వీడియో సోషల్‌‌ మీడియాలో వైరల్‌‌ అయిన సంగతి తెలిసిందే. దీనిపై అతను మాట్లాడుతూ ‘ఎవరైనా మందు తాగినప్పుడు ఇలాంటివి జరుతుంటాయి’ అని తన చర్యను సమర్థించుకున్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు బీజేపీకి మరింత ఇబ్బందికర పరిస్థితి తెచ్చిపెట్టాయి. ఈ నేపత్యంలో సోషల్‌‌ మీడియాలో వీడియో వైరల్‌‌, తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్యే ప్రణవ్‌‌ను ఉత్తరాఖండ్‌‌ పార్టీ ఇన్‌‌చార్జ్‌‌ శ్యామ్‌‌ జాజు ఇటీవల కోరారు. అతను ఇచ్చిన సమాధానంపై సంతృప్తి చెందని పార్టీ అధిష్ఠానం బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది.