మంత్రిని నియమిస్తేనే విద్యాశాఖ అభివృద్ధి : బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

మంత్రిని నియమిస్తేనే విద్యాశాఖ అభివృద్ధి : బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

హైదరాబాద్, వెలుగు:  సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేసి, పూర్తిస్థాయి మంత్రిని నియమిస్తేనే విద్యాశాఖ గాడినపడ్తుందని బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య అన్నారు. రాష్ట్రంలోని టీచర్లు, ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆరోపించారు. వెంటనే పీఆర్సీ నివేదిక తెప్పించి 51 శాతం ఫిట్‌‌‌‌మెంట్‌‌‌‌ ప్రకటించాలని డిమాండ్ చేశారు. 

శుక్రవారం ఆయన హైదరా

బాద్‌‌‌‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు గౌతమ్ రావు, రవికుమార్ యాదవ్‌‌‌‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.  వార్షిక క్యాలెండర్ విడుదల చేయాలని, ఖాళీగా ఉన్న ఎంఈఓ, హెచ్ఎం పోస్టులను భర్తీ చేయాలని, స్పెషల్ టెట్‌‌‌‌లో ఇన్‌‌‌‌సర్వీస్ టీచర్లకు 40 శాతం అర్హత మార్కులు కేటాయించాలని కోరారు. సీపీఎస్‌‌‌‌ను రద్దు చేసి అర్హులైన ఉద్యోగులందరికీ ఓపీఎస్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కొమరయ్య డిమాండ్ చేశారు.