రెడ్డి అంటే కులం కాదు.. టైటిల్

రెడ్డి అంటే కులం కాదు.. టైటిల్

రెడ్డి అంటే కులం కాదు.. టైటిల్ అన్నారు బీజేపీ జాతీయ ఉపాద్యక్షురాలు డీకే అరుణ. రెడ్డి కులం అంటే పేరు గొప్ప కానీ.. చాలా పేద కుటుంబాలు ఉన్నాయన్నారు. అగ్ర కులం అయినందుకు ప్రభుత్వ ఫలాలు అందడం లేదన్నారు. హైదరాబాద్ కొంపల్లి రైల్వే బ్రిడ్జి దగ్గర రెడ్డి సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రెడ్ల రణభేరి బహిరంగ సభ నిర్వహించారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు, రెడ్డి హాస్టల్ నిర్మాణం చేపట్టాలంటూ ఐక్యవేదిక డిమాండ్ చేసింది. సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభమైన సభలో.. పలు పార్టీలకు చెందిన రెడ్డి కులాల నాయకులు పాల్గొన్నారు.

రెడ్డి కులం పేరుకు మాత్రమే గొప్పని.. వీరిలో చాలా పేద కుటుంబాలు ఉన్నాయన్నారు Dk అరుణ. రెడ్డి అంటే కులం కాదని ఒక  టైటిల్ అన్నారు. అగ్ర కులం అయినందుకు ప్రభుత్వ ఫలాలు అందడం లేదన్నారు. అందుకే ప్రధాని మోడీ EWS రిజర్వేషన్ ఇచ్చారన్నారు. వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసే విషయం కేంద్రం దృష్టికి తీసుకు వెళ్తానని హామీ ఇచ్చారు. రెడ్డి హాస్టల్ ను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

రెడ్ల రణభేరీలో పాల్గొన్నారు రాజకీయ, సామాజిక రంగాలలో రెడ్డి కులానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి. రెడ్డి కులం ఎన్నో సామాజిక ఉద్యమాల్లో ముందు ఉందని తెలిపారు. రెడ్డీస్ లో కూడా చాలా మంది పేదవారు ఉన్నారన్నారు. ప్రధాని ముందు చూపుతో EWS 10% రిజర్వేషన్లు ఇచ్చారన్నారు. హక్కుల కోసం రెడ్లందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

రెడ్డి కులం ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు హై కోర్ట్ అడ్వకేట్ రచనా రెడ్డి. రెడ్డి ఐక్య వేదిక ఎన్నో ఉద్యమాలు చేసి, విజయాలు సాధించిందని గుర్తు చేసారు. రెడ్ల ఐకమత్యాన్ని దెబ్బ తీయడానికి  కొందరు కుట్ర చేస్తున్నారని, వాళ్ళ ఆటలు సాగవన్నారు. ఎవరు ఏ పార్టీలో ఉన్నా అందరూ కలిసి హక్కుల కోసం పోరాడాలన్నారు. రెడ్ల రణభేరికి రాష్ట్ర నలు మూలల నుంచి రెడ్డి కులస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.