కేసీఆర్ కు రాజకీయ పతనం మొదలైంది

కేసీఆర్ కు రాజకీయ పతనం మొదలైంది

సీఎం సీటు కోసం ప్రగతిభవన్లో కుటుంబ సభ్యుల మధ్య  కొట్లాట జరుగుతుందన్నారు బీజేపీ స్టేట్ ఛీప్ బండి సంజయ్. తమను సీఎం ఎప్పుడు చేస్తావని కొడుకు, బిడ్డ, అల్లుడు కేసీఆర్ ను అడుగుతున్నారన్నారు. అందుకే ఉన్నన్ని రోజులు తానే సీఎంగా ఉండాలని  కేసీఆర్ కోరుకుంటున్నాడన్నారు.  సీఎం సీటు కోసం కొడుకు, బిడ్డ, అల్లుడిని రెచ్చగొడుతూ కేసీఆర్ పబ్బం గడుపుకుంటున్నాడన్నారు.  ఇలాంటి పరిస్థితుల్లో ప్రశ్నించే గొంతును గెంటేస్తున్నారన్నారు. దీనికి ఉదాహరణ ఈటల రాజేందర్ అని అన్నారు.  ఉద్యమకారులకు టీఆర్ఎస్ లో స్థానం లేదనే...రాజేందర్  లాంటి వాళ్లను బయటకు పంపుతున్నారన్నారు.

తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతోందని.. నియంత, కుటుంబ పాలన కొనసాగుతోందన్నారు.  ప్రజల ద్రుష్టి మళ్లించడానికి  కేసీఆర్ కుట్ర చేస్తున్నారన్నారు. కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు పోయిండో అర్ధం కాలేదన్నారు. అపాయిట్ మెంట్ ఇవ్వలేదనే సాకుతో ఆత్మగౌరవం సెంటిమెంట్ ను రాజేద్దామనుకున్నాడన్నారు. అపాయిట్ మెంట్ అడగనేలేదని పీఎంవో చెప్పడంతో కేసీఆర్ కుట్ర ప్రజలకు అర్ధమైందన్నారు. సొంత పనుల కోసం ఢిల్లీకి పోయిన కేసీఆర్.. అపాయిట్ మెంట్ పేరుతో బీజేపీని అప్రతిష్టపాల్జేయాలని కుట్ర చేశాడన్నారు.

కేసీఆర్ కు రాజకీయ పతనం మొదలైనట్లు .. ఓ జ్యోతిష్కుడు చెప్పాడన్నారు. ప్రజలు చీదరించినా, చీత్కరించినా..బీజేపీని నవ్వులపాలు చేయాలనే నీచమైన కుట్రకు   కేసీఆర్   పాల్పడ్డారన్నారు. త్వరలోనే తెలంగాణ తల్లికి విముక్తి కాబోతుందని.. బీజేపీతోనే అది సాధ్యం కాబోతుందన్నారు. అందుకోసం రక్తాన్ని ధారపోయాల్సి ఉంటుందన్నారు. త్యాగాలకు మీరు సిద్ధమా? రక్తాన్ని ధారపోసేందుకు ప్రజలంతా సిద్ధమైతే.. గడీల పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించే బాధ్యత తనదన్నారు బండి సంజయ్.