ఖమ్మం ఆర్టీసీకి రూ.7.63 కోట్ల ఆదాయం : సీహెచ్ వెంకన్న

ఖమ్మం ఆర్టీసీకి రూ.7.63 కోట్ల ఆదాయం : సీహెచ్ వెంకన్న

ఖమ్మం టౌన్, వెలుగు : ఆర్టీసీకి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లోక్ సభ ఎన్నికల సంద ర్భంగా రూ.7.63 కోట్ల ఆదాయం వచ్చిం దని రీజినల్ మేనేజర్ సీహెచ్ వెంకన్న తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో ఈనెల 9 నుంచి 14 మధ్య ఓట్లు వేసేందుకు జనాలు సొంత ఊర్లకు వచ్చారు. ప్రయా ణికుల సౌకర్యార్థం అరు రోజులపాటు రీజియన్ పరిధిలోని ఆరు డిపోల్లో 519 బస్సులు, 12.34 లక్షల కిలోమీటర్ల మేరకు తిప్పి జనానికి రవాణా సౌకర్యం కల్పించామని, దీంతో ఆర్టీసీకి 7.64 కోట్ల ఆదాయం వచ్చిందని ఆర్ఎం తెలిపారు