Team India: ICC వన్డే ర్యాంకింగ్స్ టీమిండియా కుర్రోళ్లదే హవా : టాప్ 5లో ముగ్గురు మొనగాళ్లు..!

Team India: ICC వన్డే ర్యాంకింగ్స్ టీమిండియా కుర్రోళ్లదే హవా : టాప్ 5లో ముగ్గురు మొనగాళ్లు..!

Team India:  అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా రిలీజ్ చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా బ్యాటర్లు సత్తా చాటారు. వరల్డ్ వైడ్ గా ఉన్న టాప్-5 బ్యాటర్ల జాబితాలో ఈసారి ఏకంగా ముగ్గురు మన కుర్రాళ్లే ఉన్నారు. వరుసగా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ తమ అద్భుతమైన ఫామ్ తో ఐసీసీ ర్యాంకుల్లో ముందు వరుసలో నిలిచారు. ఇక న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్ వన్డే ఫార్మాట్లో నెంబర్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. గత కొంత కాలంగా అతడి నిలకడైన ప్రదర్శనే నెంబర్ –1 స్థానంలో నిలబెట్టింది. 

భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి రెండో స్థానంలో కొనసాగుతుండగా, రోహిత్ శర్మ నాలుగో ర్యాంకులో యువ సంచలనం శుభ్‌మన్ గిల్ ఐదో స్థానంలో నిలిచాడు. అలాగే, బౌలింగ్ విభాగంలో టీమిండియా నుంచి ఒక్కే ఒక్క బౌలర్ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ టాప్–-10లో స్తానం దక్కించుకున్నారు. కుల్దీప్ 9 ర్యాంకులో నిలిచి భారత్ తరఫున మెరుగైన బౌలర్ గా కొనసాగుతున్నాడు. ఇక అఫ్ఘానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌలింగ్ విభాగంలో తొలి స్థానంలో నిలిచాడు. 

కాగా టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఇండియన్ టీమ్ ఇప్పటి వరకు ఎలాంటి వన్డే మ్యాచులని ఆడలేదు. ఈ మధ్య కాలంలో బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్లు మాత్రమే వన్డే సిరీసులని ఆడినప్పటికీ, భారత ఆటగాళ్ల పాయింట్లు, గతంలో చేసిన ప్రదర్శనల ఆధారంగా వారి ర్యాంకులు ఇప్పటికీ స్థిరంగా కొనసాగుతున్నాయి.

టాప్–-5 వన్డే బ్యాటర్లు: 
డారిల్ మిచెల్ (న్యూజిలాండ్)
విరాట్ కోహ్లీ (భారత్)
ఇబ్రహీం జద్రాన్ (అఫ్గానిస్థాన్)
రోహిత్ శర్మ (భారత్)
శుభ్‌మన్ గిల్ (భారత్)

టాప్–-10 వన్డే బౌలర్లు: 
జోఫ్రా ఆర్చర్ (ఇంగ్లండ్)
కేశవ్ మహారాజ్ (దక్షిణాఫ్రికా)
బెర్నార్డ్ స్కోల్ట్జ్ (నమీబియా)
ఆదిల్ రషీద్ (ఇంగ్లాండ్)
జోష్ హేజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా)
మెహిదీ హసన్ మిరాజ్ (బంగ్లాదేశ్)
కుల్దీప్ యాదవ్ (భారత్)
మహేశ్ తీక్షణ (శ్రీలంక)