Devara Fear Song: దేవర దెబ్బకి రజినీ హుకుం సాంగ్ అవుట్.. నిర్మాత షాకింగ్ కామెంట్స్

Devara Fear Song: దేవర దెబ్బకి రజినీ హుకుం సాంగ్ అవుట్.. నిర్మాత షాకింగ్ కామెంట్స్

మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr) ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా దేవర(Devara). స్టార్ డైరెక్టర్ కొరటాల శివ(Koratala Siva) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా లెవల్లో రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమాలో ఇండియా వైడ్ గా ఉన్న స్టార్ కాస్ట్ నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా చేస్తున్నారు. ఇవన్నీ ఒకెత్తయితే.. ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ అందించబోయే సంగీతం మరో ఎత్తు కానుంది. 

నిజానికి దేవరకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు అని తెలిసినప్పటినుండి ఈ సినిమా రేంజ్ మారిపోయింది. కారణం.. అనిరుధ్ నుండి వచ్చిన గత చిత్రాలే. ఆయన మ్యూజిక్ అందించిన విక్రమ్, లియో, జైలర్ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. అందుకే.. దేవర కోసం అనిరుధ్ అందించబోయే మ్యూజిక్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో భాగంగానే.. తాజాగా దేవర నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అప్డేట్ వచ్చింది. మే 19 ఎన్టీఆర్ పుట్టినరోజుకు ఒకరోజు ముందు ఈ పాట ఆన్లైన్ లో విడుదల కానుంది. 

ఈ అప్డేట్ వచ్చినప్పటికి నుండి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మే 19 కోసం ఈగర్ గా చూస్తున్నారు. అయితే.. వారి అంచనాలను మరింత పెంచేలా నిర్మాత నాగ వంశీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా దేవర సాంగ్ పై స్పందించిన ఆయన.. దేవర ఫియర్ సింగ్ విన్నాక రజినీకాంత్ హుకుం సాంగ్ మరిచిపోతారు అంటూ రాసుకొచ్చారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. నిజానికి జైలర్ సినిమా విజయంలో హుకుం సాంగ్ కీలక పాత్ర పోషించింది. అలాంటిది దేవర సాంగ్ ఆ సాంగ్ ను మించి ఉంటుంది అంటేనే అంచనాలు పెరిగిపోతున్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఏది ఏమైనా నిర్మాత నాగ వంశీ చేసిన పోస్ట్ మాత్రం దేవర సాంగ్ పై భారీగా అంచనాలు పెంచేసింది. మరి నిజంగా ఆ రేంజ్ లో సాంగ్ ఉందా అనేది తెలియాలంటే మే 19వరకు ఆగాల్సిందే.