మనుషులా.. రాక్షసులా.. కుక్క విషయంలో చచ్చేలా కర్రలతో నడిరోడ్డుపై కొట్టారు

మనుషులా.. రాక్షసులా.. కుక్క విషయంలో చచ్చేలా కర్రలతో నడిరోడ్డుపై కొట్టారు

హైదరాబాద్ సిటీ నడిబొడ్డున.. నడి రోడ్డుపై జరిగిన ఘోరం మామూలు విషయం కాదు.. మనుషులా.. రాక్షసులా అన్నట్లు వారు ప్రవర్తించిన తీరు సిటీ జనాన్ని షాక్ కు గురి చేసింది. 10 మంది కర్రలతో.. విచక్షణారహితంగా.. నడిరోడ్డుపై రెచ్చిపోయి కొట్టారు. అడ్డొచ్చిన అతని భార్యనూ వదల్లేదు.. అడ్డుకోబోయినా పెద్దావిడనూ వదల్లేదు.. ఆ భార్యభర్తలు ఒకరికొకరు దెబ్బల నుంచి రక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నా.. ఆ నిందితులు మాత్రం వదల్లేదు.. ఆ ఇంటి కుక్క కరిచిందన్న ఒకే ఒక్క కారణంతో.. బాధితుల తరపు వారు చేసిన దాడి షాక్ కు గురి చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

యూసఫ్ గూడ పరిధి రెహమత్ నగర్ లో ఉండే ఉద్యోగి నిమ్మటూరి శ్రీనాథ్, స్వప్న దంపతులు ఈనెల 8న ఉదయం బ్యాలెట్ ఓటు వేసేందుకు ఇంట్లోంచి బయటకు వచ్చారు. శ్రీనాథ్ సోదరుడు మధు తలుపు తీసి వేయకపోవడంతో కుక్క బయటకు వెళ్లింది. ఆ సమయంలో ఇంటి ఎదురుగా కొత్త ఇంటిని నిర్మిస్తున్న ధనుంజయ్ అనే వ్యక్తి నిలబడి ఉండగా కుక్క వెళ్లి అరిచింది. దీంతో శ్రీనాథ్ వెంటనే తన కుక్కను అడ్డుకోగా.. 'మీ కుక్కను మాపై ఎందుకు రెచ్చగొడుతున్నారు.. అంటూ ధనుంజయ్ తిట్టాడు. ఇదే విషయమై గతంలోనూ పీఎస్ లో కేసు నమోదైంది.

మళ్లీ మంగళవారం సాయంత్రం 7 గంటలకు శ్రీనాథ్ దంపతులు, వారి మేనల్లుడు సాత్విక్ వాకింగ్ చేసేందుకు కుక్కను తీసుకుని బయటకు వచ్చారు. దీంతో ధనుంజయ్ వర్గీయులు వారిని తిడుతూ చంపుతామంటూ బెదిరించి కర్రలతో, రాడ్లతో దాడి చేశారు. దీంతో శ్రీనాథ్ కు తీవ్రగాయాలపాలైయ్యాడు. స్వప్న, సాత్విక్ లు అడ్డుకోగా వారిని సైతం విచక్షణా రహితంగా కొట్టారు.

ఇరువురికి గాయాలవగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషయమంగా ఉన్నట్టు తెలుస్తుంది. కుక్క పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం. ధనుంజయ్ అతని వర్గీయులపై శ్రీనాథ్ సోదరుడు మధు బుధవారం పోలీసు లకు కంప్లయింట్ చేయగా హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ బాల్ రాజ్ తెలిపారు. దాడికి పాల్పడిన ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు.