ఎంబ్రాయిడరీ వర్క్ లో స్త్రీలకు ఉచిత శిక్షణ

ఎంబ్రాయిడరీ వర్క్ లో స్త్రీలకు ఉచిత శిక్షణ

సంగారెడ్డి టౌన్, వెలుగు :  స్త్రీలకు స్వయం ఉపాధి కల్పన లో భాగంగా మగ్గం ఎంబ్రా యిడరీ వర్క్ లో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ను ఆహ్వానిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి కల్పన శిక్షణ కేంద్రం డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు. న్న మహిళలు అర్హులన్నారు. విద్యార్హత సర్టిఫికెట్లు, రేషన్ కార్డ్, ఆధార్, నాలుగు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో సంగారెడ్డి బైపాస్ రోడ్డు లోని శిక్షణ కేంద్రంలో

నేరుగా దరఖా స్తు చేసుకోవాలన్నారు. ఈనెల 20 నుంచి శిక్షణ నెల రోజుల పాటు కొనసాగుతుందని, ఆసక్తి కలవారు9704446956, 94901 29839 నంబర్లను సంప్రదించాల్సిందిగా సూచించారు. శిక్షణ సమయంలో వసతి భోజనం పూర్తిగా ఉచితంగా ఉంటుందని, మెదక్ సంగారెడ్డి జిల్లాకు చెందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సృష్టం చేశారు.