గిరి జను లకు అండగా ప్రభుత్వం : ఎమ్మెల్యే రోహిత్  

గిరి జను లకు అండగా ప్రభుత్వం : ఎమ్మెల్యే రోహిత్   
  • ఎమ్మెల్యే రోహిత్ ​  

మెదక్, వెలుగు: గిరిజనులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే రోహిత్ అన్నారు. గురువారం మెదక్ పట్టణంలో నిర్వహించిన సేవాలాల్ జయంతిలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ మెదక్​ నియోజకర్గంలోని తండాల్లో రూ.8  కోట్లతో వివిధ రోడ్ల మరమ్మతులుచేసినట్టు గుర్తు చేశారు. తండాల్లో మౌలిక వసతుల మెరుగుదలకు కృషి చేస్తామన్నారు. కలెక్టర్​ రాహుల్​ రాజ్​ మాట్లాడుతూ బంజారాల్లో జ్ఞానజ్యోతిని వెలిగించిన గొప్ప ఆధ్యాత్మిక గురువు, ఆరాధ్యదైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ అన్నారు.

బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేలా అహింసా సిద్ధాంతానికి పునాదులు వేసిన మహనీయుడని కొనియాడారు. మీరా కాలనీలో  బంజారాల కోసం కేటాయించిన స్థలాన్ని పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆర్డీవో రమాదేవి, మున్సిపల్​ చైర్​పర్సన్​ రాధిక, వైస్​ చైర్​ పర్సన్​ నరేశ్​గౌడ్, గిరిజన సంక్షేమ అధికారి నీలిమ, లంబాడా హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్ నాయక్, బంజారా సంఘం పూజారులు కల్కి మహరాజ్, భిక్షూ మహరాజ్, కౌన్సిలర్ సంధ్య పాల్గొన్నారు.