ప్రభుత్వ విద్యా సంస్థలు అభివృద్ధి చెందాలి : మాజీ ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి

ప్రభుత్వ విద్యా సంస్థలు అభివృద్ధి చెందాలి : మాజీ ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి
  • మాజీ ప్రొటెం చైర్మన్​ భూపాల్ రెడ్డి

రామచంద్రాపురం, వెలుగు: ప్రైవేటు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలు అభివృద్ధి చెందాలని, ఆ దిశగా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని మాజీ ప్రొటెం చైర్మన్​ వెన్నవరం భూపాల్ రెడ్డి అన్నారు. రామచంద్రాపురంలోని గీతా భూపాల్​ రెడ్డి ప్రభుత్వ జూనియర్​ కాలేజీ 18 వ వార్షికోత్సవానికి గురువారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్ధులకు బహుమతులను అందజేసిన మాట్లాడారు.  

కార్పొరేట్​కాలేజీకి ఏ విషయంలో తీసిపోకుండా ప్రభుత్వ కాలేజీని సొంత నిధులతో అభివృద్ధి చేశామన్నారు. ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధికి ముందుకు రావాలని కోరారు. జూనియర్​ కాలేజీ విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించడం సంతోషంగా ఉందన్నారు.

అనంతరం భారతీనగర్ మాజీ కార్పొరేటర్ సింధూ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే స్టూడెంట్స్​ లక్ష్యాలను నిర్ధేశించుకోవాలని సూచించారు. పేదల విద్యాభివృద్ధికి తమవంతు సహకారం ఎల్లప్పుడు అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కో ఆర్డినేటర్​ వెన్నవరం ఆదర్శ్​రెడ్డి, ప్రిన్సిపాల్​వెంకట్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు పుష్పనగేశ్, అంజయ్య యాదవ్, కుమార్ గౌడ్, విష్ణువర్ధన్​ రెడ్డి, వెన్నవరం సంతోష్ రెడ్డి, అప్పల భాస్కర్​, గౌస్​ పాల్గొన్నారు.