డైవర్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డ్రామా పాలి టిక్స్ బండి సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు అలవాటే : సుడా చైర్మన్ కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి

 డైవర్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డ్రామా పాలి టిక్స్ బండి సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు అలవాటే : సుడా చైర్మన్ కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి

కరీంనగర్ సిటీ, వెలుగు: డైవర్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డ్రామా పాలిటిక్స్ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెన్నతో పెట్టిన విద్య అని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ గెస్ట్ హౌజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రహస్య ఒప్పందం చేసుకున్నాయని, ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీపై బురుద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ కార్పొరేటర్లతో క్యాంపు పెట్టుకుంటే ఆగమేఘాల మీద ఇండిపెండెంట్లకు బీజేపీ కండువాలు కప్పి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బద్నాం చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఇప్పటివరకు బండి సంజయ్ కరీంనగర్ ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతే  ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. మీడియా సమావేశంలో కార్పొరేటర్లు మల్లికార్జున రాజేందర్, గంట శ్రీనివాస్, వరాల నర్సింగం, పర్వతం మల్లేశం, జగన్ రెడ్డి, పాల్గొన్నారు.